కైకిలొచ్చిన జనాలు జంప్..?

కైకిలొచ్చినోళ్లు ఎంత సేపు ఉంటరుల్లా. శెప్పుర్రి. టైంకు వస్తరు. టైంకు పోతరు. అంతకు మించి ఉండాల్నంటె అయితదా. ఇంటితాన బరెగొడ్లుంటయ్. మేతెయ్యాలెగదా. పాలు తియ్యాలె గదా. కేంద్రానికి పొయ్యాలె గదా. బుడ్డగాళ్లు బడికి పొయ్యొస్తరు. అన్నం పెట్టాలె గదా. వాళ్లను చూస్కోవాలె గదా. ఉంటరా శెప్పుర్రి. గదే అయితుందట రేవంత్ సభల్ల.


Published Feb 05, 2026 01:12:49 PM
postImages/2026-02-05/1770277369_3copy.jpg

వామ్మో ఏందుల్లా గిట్లుంటుర్రు సోషల్ మీడియాల. రేవంత్ సార్ వస్తుంటె. జనం కనపడాలె అని లోకల్ లీడర్లు..గా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు గట్రా జనాల జమ చేస్తుర్రట. ముఠాల్ల కైకిలి పొయ్యెటోళ్లను పిలుస్తర్రట. వాళ్లల్ల సగం మంది గసొంటోళ్లే నట. ఎన్నెన్ని మాటలంటుర్రు సీఎం సార్ సభల మీద. ఎందుకంటుర్రో ఎర్కేనా. అగో...సీఎం సార్ అటు దిక్కు మాట్లాడ్తనే ఉన్నడా. ఇటు దిక్కు పోతనే ఉన్నరు గదా. సార్ ను సూడాలె. మాకు అద్భుతమైన పాలన అందిస్తున్న సీఎంను కండ్లార సూడాలె అని వచ్చినోళ్లు ఇట్ల పోతరా శెప్పుర్రి. మా బంగారు కొండ మా అన్న మా తమ్ముడు మా కాక..మాకు మంచి మంచి సౌలత్ లు కల్పిస్తుండు, హామీలన్ని అమలు చేస్తుండు అనుకోని చూశెటందుకు వచ్చినోళ్లు ఇట్ల పోతరా శెప్పుర్రి.

పాపం పోలీసోళ్లు గూడ అప్పట్ల ఆపెటందుకు ట్రై జేశెటోళ్లు గానీ. ఇప్పుడు ఇడ్శేస్తుర్రు. వాళ్లను ఆపినా ఆగరులే అని లైట్ తీస్కుంటుర్రు. ఇగ జనాలు గూడ ఇంటితాన పన్లుంటయ్ గదా. శీకట్ల పడి పోవాల్శి వస్తది అని దారివడ్తుర్రు. రేవంత్ సార్...మీరు మాట్లాడుతుండంగనే పోతుర్రంటె ఎంత నామార్ద సార్. మీ భాష గూడ జర ఏ గ్రేడ్ భాష అంటుర్రు సార్. మొన్న కొత్త సద్వేదో సద్వొచ్చినంక గూడ అట్లనే ఉందట గదా సార్. అందుకు కొంత పోతుర్రనవట్టె. ఏమో సార్. జనాలు పోక ముందే స్పీచ్ ముగిస్తె మంచిదేమో చూస్కోర్రి సార్. ఇట్లవోతుంటె...సీఎం రేవంతు మాట్లాడుతున్నా జనాలు పోతుర్రు అంటె..మా అసొంటి అభిమానులకు ఎంత నామోషీగ ఉంటది అని జనం ఫీలైతుర్రు సార్. చూస్కోర్రి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles