రేవంత్ కొత్త బంగ్లా

సీఎం సార్. గిట్లనే ఉంటదా. గిదేనా పద్దతి. ట్రాఫిక్ ఆగొద్దు నాకోసం అన్నడు ఆ నడ్మ. అద్వర్దాంక ట్రాఫిక్ ల కానిస్టేబుల్ గూడ మిమ్మల్ని ఆపెటోళ్లు గావట్టి..కొత్తల కొన్నాళ్లు మంచిగనే నడ్శింది. ఒకటీ రెండు మాట్ల వీడియోలు తీపిచ్చుకోని పబ్లిసిటీ గూడ చేపిచ్చుకున్నరు. ఇగ అటెంక అంత ఆగమే రోడ్లమీద. సార్ ప్రజాభవన్ ల ఉండడాయె. జూబ్లీహిల్స్ ప్యాలెస్ అంత సౌలత్ లు ప్రజాభవన్ ల ఉండవు అనుకున్నడో ఏమో గానీ భట్టి సార్ కు ఇచ్చె. సరే..ఆయన ప్యాలెస్ ల ఆయనుంటుండున్నడు లే అనుకుంటె..ఇప్పుడు అంతకు మించిన బంగ్లా కట్టిస్తున్నడు ఎర్కేనా.