ఎన్నికలు కాంగనే రైతు భరోసా

సార్. నమ్మకం లేదు సార్. మాకు నిజంగ నమ్మకం లేదు సార్. చెప్పీ చెప్పీ యాష్టకొచ్చింది నాకు. ఇగో అగో అని..నేనే శాన సార్లు చెప్పినా సార్. రైతు భరోసా అగో వస్తది ఇగో వస్తది అంటె..ఆశ పడ్డరు రైతులంత. మల్లేదో అంటుర్రు గదా నమ్మాల్నా సార్.


Published Feb 05, 2026 01:06:46 PM
postImages/2026-02-05/1770277006_2copy.jpg

మల్ల రైతు భరోసా పేరు తీశిండుల్లో రేవంత్ సారు. అగో..మున్సిపల్ ఎన్నికలున్నయ్ అని బయటకొచ్చిండు గదా రేవంత్ సారు. దావోస్ కెంచి ఉర్కులు పర్గుల మీదొచ్చిండా. ఇగ్గో...ఇయ్యాల్నే రేప్పొద్దునే రైతు భరోసా ఇస్తానంటున్నడు.

సార్. నమ్మకం లేదు సార్ మాకు. మొన్నానడ్మ సంక్రాంతి అన్నరా. అటెంక జనవరి ఇరవై ఆరు ఎల్లిన తెల్లారే అన్నరా. ఇప్పుడొచ్చి మున్సిపల్ ఎన్నికలు అంటుర్రు. సార్..మీరు ఎన్నికల కోసం ఎన్ని మాటలైన చెబుతరని ఎర్కనే సార్. కనీ...రైతు భరోసా నడ్మ రెండు దఫాలు ఎగ్గొట్టిర్రట గదా సార్. గవిస్తరా. అటుకెంచి అటే పొయ్నట్లాఅని రైతులు అడుగుతుర్రు సార్. గెల్శి రెండేండ్లు దాటినా ఒక్కపారే ఏశిర్రు గదా సార్. రైతు భరోసా మల్లేస్తం అంటె నమ్మెతట్లు లేరు జనాలు. ఏమోనుల్లా. ఇస్తం ఇస్తం అని మున్సిపల్ ఎన్నికల్ల ఓట్లేపిచ్చుకోని..అటెంక ఇయ్యకపోతె ఏం జెయ్యాల్నో తెలుస్తలేదని నీరసం అయితుర్రు జనాలు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu manateenmar

Related Articles