రేవంతాలు సార్. ఓ రేవంతాలు సార్. ఎందుకు సార్. పిల్లల ఉసురుపోస్కుంటరు. పాపం తగలదా సార్. గింత గూడ పాపం అనిపిస్తలేదా సార్. అర్రే పాపం గదా పిలగాళ్లు తిప్పలు పడ్తుర్రు. పట్టెడన్నం తినెటందుకు ఇన్ని గోసలు పడవల్శిన అక్కెరున్నదా అని ఆలోశ్న జెయ్యరా సార్. ఎంత సేపు ఫుట్ బాల్ ఆట, ఎన్నికలెప్పుడు పెట్టాలె, మూసీ ఒడ్డనోళ్లను ఎప్పుడు కూల్శాలె, ఫ్యూచర్ సిటీకి నిధులెట్ల ఇయ్యాలె గిదే ఉంటదా సార్. అగో..అటు దిక్కు సూడుర్రి పిలగాళ్లు ఎంత గోసవడ్తుర్రో.