సింగిల్ ట్రిప్ వెళ్లాలంటే కుర్రాళ్లకు కూడా ఈ రోజుల్లో సేఫ్ కాదు. కాని కొన్ని ప్లేసులు మాత్రం భలే వర్కవుట్ అవుతాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గత కొంతకాలంగా మన దేశంలో సోలో ట్రిప్స్ ..ట్రెండ్ పెరిగింది. సింగిల్ ట్రిప్ వెళ్లాలంటే కుర్రాళ్లకు కూడా ఈ రోజుల్లో సేఫ్ కాదు. కాని కొన్ని ప్లేసులు మాత్రం భలే వర్కవుట్ అవుతాయి. ఇప్పుడు మేం చెప్పే ప్లేసులు గర్ల్స్ కి కూడా సేఫే ..చూసేద్దాం రండి.
* మైసూర్ ...దక్షిణ భారతదేశంలో మీరు ట్రిప్ కి వెళ్లాలి అనుకుంటే కచ్చితంగా మైసూర్ వెళ్లాల్సిందే. మైసూర్ ప్యాలెస్ , చాముండేశ్వరి దేవి ఆలయం , బృందావన్ గార్డెన్స్ అధ్భుతంగా ఉంటాయి. దగ్గర్లో ఇంకా చాలా ప్లేసులు ఉంటాయి . అంతే కాదు పురాతన దేవాలయాలు కూడా ఉంటాయి. మీరు ఈ ప్లేస్ లో ఎక్కడా భయం లేకుండా సేఫ్ గా హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యొచ్చు.
* రిషికేష్ ..దేవభూమి రిషికేష్ కి కూడా సోలో ట్రిప్ చేయొచ్చు. త్రివేణి ఘాట్, లక్ష్మణ ఝూలా, గంగా హారతి చాలా ఫేమస్. రిషికేష్ వెజ్, ఆయుర్వేదిక్ ఫుడ్ బాగుంటుంది. 3-4 రోజుల్లో రిషికేష్ చూడొచ్చు.ఇక్కడ మీరు చెయ్యాల్సిందల్లా ...మంచి టూరిస్ట్ ప్లాన్ తీసుకొని వెళ్లండి...అప్పుడు సేఫ్టీ వారి బాధ్యత ...మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు. మీ ట్రిప్ ను మీరు ఎంజాయ్ చెయ్యొచ్చు.
* జైపూర్ రాజస్థాన్ కల్చర్ చూడాలంటే జైపూర్ వెళ్లాల్సిందే. ఆమెర్ కోట, హవా మహల్, సిటీ ప్యాలెస్ చూడొచ్చు. దాల్-బాటీ చూర్మా కచ్చితంగా రుచి చూడాల్సిందే.
* పాండిచ్చేరి ...తక్కువ బడ్జెట్ తో సోలో ట్రిప్ కు పర్ఫెక్ట్ బెస్ట్ . బీచ్ లు , పోర్చుగీస్ కాలనీ , నేచర్ అందాలు భలే ఎంజాయ్ చేస్తారు. సీ ఫుడ్ సూపర్ ఉంటుంది ట్రై చెయ్యండి.
*కాశీ వెళ్లాలని అందరికీ ఉంటుంది. సోలో ట్రిప్ కి వారణాసి బాగుంటుంది. ఘాట్ లు, సారనాథ్, బెనారస్ గల్లీలు చూడొచ్చు. లైఫ్ లో కాస్త ఇరిటేషన్...ఎప్పుడైనా చాలా లో అయిపోయాం అనుకుంటే మాత్రం పక్కాగా కాశీ సింగిల్ గా వెళ్లండి.
* కేరళలో కొచ్చిన్ కూడా బాగుంటుంది. సింగిల్ గా వెళ్లినా ఎంజాయ్ చేయగల ప్లేస్ ఇది. ఫుడ్ లవర్స్ కి కొచ్చిన్ బెస్ట్. సీ ఫుడ్ బాగుంటుంది.
*సరస్సుల నగరం ఉదయ్ పూర్ కూడా సోలో ట్రిప్ కి బాగుంటుంది. సిటీ ప్యాలెస్, పిచోలా సరస్సు చూడొచ్చు. రాజస్థాన్ సంస్కృతి తెలుస్తుంది. ఒక సారి ట్రై చెయ్యండి. లైఫ్ విల్ బీ వెరీ ఎగ్జైయింటింగ్.