సాయంత్రం జరిగే గ్రాండ్ ఫనాలే తో సీజన్ 8 కి ఎండ్ కార్డు పడనుంది. ఫైనలిస్టులుగా ప్రస్తుతం అవినాష్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్ హౌస్ లో ఉన్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడు నెలలు నడిచింది. ఈ రోజే ఆఖరి రోజు. విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. సాయంత్రం జరిగే గ్రాండ్ ఫనాలే తో సీజన్ 8 కి ఎండ్ కార్డు పడనుంది. ఫైనలిస్టులుగా ప్రస్తుతం అవినాష్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్ హౌస్ లో ఉన్నారు.
వీరిలో గౌతమ్, నిఖిల్ మధ్య టైటిల్ ఫైట్ ఉండబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరు గెలిచినా చాలా వరకు అతి తక్కువ మార్జిన్ తో గెలుస్తారు. ఆల్రెడీ గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక, విజేతని ప్రకటించాక కంటెస్టెంట్స్ అంతా బయటకి వస్తారు.
లాస్ట్ సీజన్ లో ..ఫినాలే సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. శివాజీ, పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇతర కంటెస్టెంట్స్ వాహనాలపై దాడి చేయడం లాంటి సంఘటనలు జరిగాయి. పల్లవి ప్రశాంత్ ఈ ఫేమ్ ను తట్టుకోలేక...ఈ క్రౌడ్ ను భరించలేక కొన్నాళ్లు ఎటో వెళ్లిపోయాడు కూడా. పల్లవి ప్రశాంత్ ర్యాలీని అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా కాలేదు. బిగ్ బాస్ తెలుగు 7లో పల్లవి ప్రశాంత్ అమాయకంగా కనిపిస్తూ క్రమంగా ఇంటెన్సిటీ పెంచాడు. ఆ రోజు జరిగిన రచ్చ ఈ రోజు జరగకుండా బిగ్ బాస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు 300 మంది పోలీసులను కూడా ఏర్పాటు చేశారట. ఈ సారి ఎన్ని పెద్ద ర్యాలీలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు రావంటుంది బిగ్ బాస్ టీం.