రేవంత్ అంటేనే మోసం..!


Published Apr 02, 2025 11:47:53 AM
postImages/2025-04-02/1743574673_harishrao5.jpg

రేవంత్ అంటేనే మోసం

రేవంత్ మాటలు ఘనం.. చేతలు హీనం
మోసం చేయడం అలవాటుగా మారింది 
దసరా.. సంక్రాంతి.. ఉగాది పండగలకు  రైతు భరోసా ఇస్తామన్నారు  
ఊరించారు..ఉసూరుమనిపించారు!
డేట్లు.. డెడ్ లైన్లు మారుతున్నాయి 
హామీలు మాత్రం నెరవేరడం లేదు  మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం


తెలంగాణం, హైదరాబాద్ (ఏప్రిల్ 1): సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఘనంగా ఉంటే, చేతలు హీనంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, మాట తప్పడం, రైతులను మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని విమర్శించారు. జనవరి 26న రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులను మార్చి 31లోగా రైతుల అకౌంట్లో జమ చేస్తామని రేవంత్ ప్రకటించారని, ఆ హామీ ఇంకా నెరవేరలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ మార్చి 31 కల్లా రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇంకా ఏప్రిల్ 1వ తేదీ వచ్చినా ఆ నిధుల గురించి ఎలాంటి ప్రకటన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ మాటలు కోటలు దాటితే అడుగు గడప దాటడం లేదన్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ఉగాది వేళ ఆశగా ఎదురుచూసిన రైతులకు చేదు అనుభవమే ఎదురైందని పేర్కొన్నారు. రైతులను ఇంకెన్ని సార్లు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. 'దసరాకిస్తమన్నారు.. ఇవ్వలేదు. సంక్రాంతికి ఇస్తమన్నారు.. ఇవ్వలేదు. ఉగాదికి ఇస్తామని ఊరించారు. రైతుల్ని ఉసూరుమనిపించారు.'అని విమర్శించారు. కొత్త సంవత్సరం రైతులకు చేదు అనుభవాన్ని మిగుల్చింది ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. 

కేసీఆర్ నాట్ల సమయంలో రైతు బంధు ఇస్తే, రేవంత్ రెడ్డి కోతల సమయం వచ్చినా రైతు భరోసా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మోసమే తన విధానంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి రైతుల్ని అన్ని కోణాల్లో దగా చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. రుణమాఫీని దారుణ వంచనగా మార్చిండు అని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడుగు ముందుకు పడటం లేదని అన్నారు. డేట్లు.. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప, రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు, అసెంబ్లీలో ప్రకటించినట్లు రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా, రైతు భరోసా ఇచ్చే దాకా బీఆర్ఎస్ పార్టీ నిన్నూ, నీ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉంటుందని మండిపడ్డారు. ఎక్కడిక్కడ నిలదీస్తూ, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని  హరీష్ రావుస్పష్టం చేశారు.

newsline-whatsapp-channel
Tags : kcr revanth-reddy brs congress harish-rao

Related Articles