Viral Video: ఇది కదా ..టేబుల్ మ్యానర్స్ అంటే ..క్యూట్ గా భలే తింటుంది కదా !

ఓ ఎలుగుబంటి తన డైనింగ్ టేబు్ల మీద ఫుడ్ పెట్టుకొని తింటూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అది కూడా చాలా నీట్ గా తినడం ఫుల్ వైరల్ అవుతుంది.         


Published Apr 01, 2025 08:04:00 PM
postImages/2025-04-01/1743518154_beareatingcabbageonthea51298db19vjpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సాధారణంగా జంతువులు అడవుల్లో దొరికిన  ఆహారం ఇష్టం వచ్చినట్లు తింటుంటాయి. డెన్ లలో ఉండే జంతువులైతే ఓనర్ పెట్టిన ఫుడ్ కింద వేసుకొని మీద వేసుకొని తింటాయి. ఓ ఎలుగుబంటి తను డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టుకొని తింటూ నెటిజన్లకు ఆకట్టుకుంటాయి.  అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. ఓ ఎలుగుబంటి తన డైనింగ్ టేబు్ల మీద ఫుడ్ పెట్టుకొని తింటూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అది కూడా చాలా నీట్ గా తినడం ఫుల్ వైరల్ అవుతుంది.                                  

 తను తెచ్చుకున్న క్యాబేజీని నీట్‌గా టేబుల్‌పైన పెట్టుకొని బెంచ్‌మీద కూర్చుని చక్కగా తింటోంది. ఇంతలో అది గమనించిన ఓ వ్యక్తి దానికి క్యారెట్‌, ఇంకా కొన్ని దుంపలు తీసుకొచ్చి ఆ టేబుల్‌పైన పెట్టాడు. బేర్‌ వాటిని తినలేదు. అయితే ఆ వ్యక్తి క్యారెట్ తీసి ఎలుగుబంటికి తినమని ఇచ్చాడు. అయితే ఎలుగుబంటి ఆ క్యారెట్ ను అలా చూస్తూ వాటిని తిని తిని బోర్ కొట్టింది..నాకేం వద్దు..అంటూ క్యాబేజీ తింటున్నట్లు ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.


ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 3 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 83 వేలమందికి పైగా లైక్‌ చేశారు. ఈ బేర్‌ను మా ఇంటికి విందుకు పిలవాలనుంది అని ఇంకొందరు కామెంట్లు చేశారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu forestofficials viral-video

Related Articles