తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ రాజ్యసభ పదవిని అభిషేక్ మను సింఘ్వికి అవకాశం ఇచ్చింది.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. తెలంగాణ రాజ్యసభ పదవిని అభిషేక్ మను సింఘ్వికి అవకాశం ఇచ్చింది. సింఘ్విను ఎంపిక చేసినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధికారికంగా బుధవారం ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీని ఎంపిక చేయడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు హైకమాండ్‌పై గరం గరంగా ఉన్నారు. ఇటివల బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కె. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేశవరావు రాజీనామా చేయడంతో రాజ్యసభ ఉప ఎన్నికు జరగనుంది. తెలంగాణ రాష్ట్రంతో సహా పలు రాష్ట్రాలకు రాజ్యసభ ఉపఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3 న ఎన్నికలు నిర్వహించనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఆగస్టు 26-27 గా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల పత్రాల దాఖలుకు ఆగస్టు 21 చివరి తేదీ అని ఈసీ తెలిపింది.
రాజ్యసభ పదివి కోసం గత కొద్ది రోజులుగా నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే హైకమాండ్ మాత్రం తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేయడంపై విమర్శలు వెలువెత్తున్నాయి. తెలంగాణ నేతలను కాదని హైకమాండ్ రాజస్థాన్ నుంచి సింఘ్వీను ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై కొందరు నేతు తప్పుపడుతున్నారు.