అవును నిజమే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదు.. ఇంకా 17.14 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: అవును నిజమే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయలేదు.. ఇంకా 17.14 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదని తెలిపారు. 1.20 లక్షల మందికి ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయామన్నారు. 1.61 లక్షల మందికి ఆధార్ కార్డు మరియు లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి అని తెలిపారు.
1.50 లక్షల అకౌంట్లలలో బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి ఆయన తెలిపారు. కాగా, 4.83 వేల మందికి రేషన్ కార్డులు లేవు అన్నారు. 8 లక్షల మందికి 2 లక్షల రుణం పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రతి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. అలాగే ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు.