ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైలు నుంచి బయటకి వచ్చిన కేజ్రీవాల్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల్లో తన సీఎం పదవికి రాజీనామా చేస్తానాని ప్రకటించారు. తన భవిష్యత్ ను ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు. తను నిజాయితీగా ఉన్నానని ప్రజలు భావిస్తేనే తనకు ఓటు వేయాలని ఆయన స్పష్టం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ సవాల్ చేశారు. తను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానని.. నవంబరులో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల వరకు మరొకరు తన స్థానంలో సీఎంగా ఉంటారని తెలిపారు. కాగా, ఫైల్స్ పై సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.