హాస్టల్‌లో తమకు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని, చదువుకోవడానికి కనీస వసతులు కూడా లేవని కొడంగల్ నియోజకవర్గం కోస్గిలోని నాచారం కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నడిరోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ఆందోళనలు దర్శనమిస్తున్నాయి. పెండింగ్ బిల్లులను సర్కార్ చెల్లించడం లేదని రైతులు, దళితబంధు చెల్లించలేదని లబ్ధిదారులు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదని కానిస్టేబుల్ అభ్యర్థులు, జీవో 46 బాధితులు, స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు చేస్తున్నారు.
ఇక తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా ఆందోళనలు తప్పడం లేదు. హాస్టల్‌లో తమకు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తున్నాయని, చదువుకోవడానికి కనీస వసతులు కూడా లేవని కొడంగల్ నియోజకవర్గం కోస్గిలోని నాచారం కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నడిరోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు.
ప్రస్తుతం ఉన్న మెస్ సిబ్బంది మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, చదువుకోవడానికి హాస్టల్ విద్యార్థుల కోసం ఇచ్చిన కంప్యూటర్స్ కూడా వాడనివ్వడం లేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చేంత వరకు ధర్నా ఆందోళనలు ఆపేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.