delivery persons: డెలివరీ పార్ట్‌నర్స్ కు గుడ్ న్యూస్.. అమెజాన్ కీలక నిర్ణయం

 డెలివరీ పార్ట్ నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


Published Aug 24, 2024 10:14:00 PM
postImages/2024-08-24/1724517972_download.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ కామర్స్ సంస్థల ద్వారా వేలాది మంది ఉద్యోగాలు పొంది..జీవనం నడుపుతున్నారు. పార్ట్ టైం , ఫుల్ టైమ్ డెలివరీ పర్సన్స్ గా చేస్తూ కష్టపడే తమ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఈ కామర్స్ మేనేజ్ మెంట్. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల్లో డెలివరీ పార్ట్ నర్స్ గా చేరి ఉపాధి పొందతున్నారు.  డెలివరీ పార్ట్ నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


డెలివరీ పార్ట్ నర్స్ విశ్రాంతి లేకుండా వర్క్ చేస్తుంటారు. ఎండా, వాన అనే తేడా లేకుండా గంటల తరబడి తిరుగుతూ ఆర్డర్లను పంపిణీ చేస్తుంటారు. ఆన్ లైన్ మార్కెట్ విస్తరించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశ వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్ రూమ్స్ సౌకర్యాలు విశ్రాంతి కేంద్రాల్లో కల్పించనున్నారు.

అయితే దీనికి కూడా ఎంప్లాయిస్ దగ్గర ఉండే లాగిన్ సహాయంతో  ముందుగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో ఈ విశ్రాంతి కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ పార్ట్ నర్స్ కూడా ఈ కేంద్రాల్లో రెస్ట్ తీసుకోవచ్చని తెలిపారు. అది కూడా జస్ట్ 30 నిమిషాలు పాటు రెస్ట్ తీసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu online

Related Articles