GANJA : ఇక పై గంజాయి సాగు ..లీగల్ !


హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్రంలో గంజాయి సాగును లీగల్ చేసింది.గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలనే విషయం ముందుగా ఒక కమిటీని కూడా వేశారు.


Published Sep 07, 2024 11:02:00 PM
postImages/2024-09-07/1725730443_100622marijuana.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: గంజాయి అనగానే ఇల్లీగల్ అని మన మైండ్ కి తెలుస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది అదే ..గంజాయి మంచిది కాదు. ఆ అలవాటు అంత సమాజానికి కాని ఇంటికి కాని ఒంటికి కాని మంచిది కాదు అని..కాని సడన్ గా గంజాయి ఇక పై లీగల్ అని చెబితే ఏమంటాం..షాక్ అవుతాం. అసలు దీని వల్లే చాలా మంది పాడైపోతున్నారు. ఏంటి ఇదంతా అనుకుంటారు. అయితే ఈ గంజాయి ని లీగల్ చేసింది ఓ రాష్ట్రం. దీని కోసం అసెంబ్లీ వాదనలు ప్రతివాదనలు చాలా జరిగాయి.


హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్రంలో గంజాయి సాగును లీగల్ చేసింది.గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించాలనే విషయం ముందుగా ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికలోని సిఫార్సుల అమల్లో భాగంగా గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించే నిర్ణయాన్ని తీసుకున్నామని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అయితే గంజాయి లో కూడా  ఔషద గుణలున్నాయి. కాబట్టి కేవలం మందులకు మాత్రమే ఈ పర్మిషన్ దొరుకుతుంది. కాని ఈ సాగుకు ముందు మాత్రం కంపల్సరీ పర్మిషన్లు తీసుకోవాలి.

జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లలో చట్టబద్ధంగా జరుగుతున్న గంజాయి సాగు నమూనాలను అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే నెటిజన్లు మాత్రం మరోలా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడున్న చాలా మత్తుమందులు అలా మెడిసిన్ కోసం మొదలయినవే అంటున్నారు నెటజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu assembly health-benifits himachalpradesh farming

Related Articles