GST Council: ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గించిన కేంద్రం

లైఫ్ ఇన్సూరెన్స్ లపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని ఫిక్స్ అయ్యింది మోదీ ప్రభుత్వం. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయాలపై ఆలోచించాలని ఫిక్స్ అయ్యింది. వీటిపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.


Published Sep 10, 2024 07:03:00 AM
postImages/2024-09-10/1725932039_167993325178151.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నరేంద్రమోదీ సర్కార్ జీఎస్టీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాపం మధ్యతరగతి ప్రజల వెన్ను విరుగుతున్న సంగతి ఇప్పటికి నిర్మలా సీతారామన్ కు అర్ధమయినట్లుంది.జీఎస్టీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొన్ని వస్తువులపై ఉన్న జీఎస్టీని కొంత శాతం తగ్గించింది. మరికొన్ని వస్తువులపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ , లైఫ్ ఇన్సూరెన్స్ లపై విధిస్తున్న జీఎస్టీని తగ్గించాలని ఫిక్స్ అయ్యింది మోదీ ప్రభుత్వం. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న విషయాలపై ఆలోచించాలని ఫిక్స్ అయ్యింది. వీటిపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.


జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని మంత్రుల బృందానికి అప్పగించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నవంబర్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆరోగ్య, భీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు విషయం వెల్లడిస్తామన్నారు నిర్మలా సీతారామన్. ఎంత తగ్గిస్తామనేది మాత్రం కౌన్సిల్ నిర్ణయమని ..అది సమావేశంలోనే తెలియజేస్తామని తెలిపారు.


బీహార్‌ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌధరి నేతృత్వంలో ఏర్పడిన మంత్రి బృందానికే ఈ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తగ్గింపుపై ఈ బాధ్యతను అప్పగించింది. కొంతమంది కొత్త సభ్యులు కూడా ఈ బృందంలో చేరతారని.. వారంతా అక్టోబర్‌ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయితే జీఎస్టీ పూర్తి తొలగించినవేంటో ...జీఎస్టీ తగ్గించినవేంటో అక్టోబర్ , నవంబర్ లో పూర్తి నివేదిక బయటపెడతామని తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : congress-government narendra-modi gst nirmalasitharaman

Related Articles