టైగర్ రిజర్వ్‌లో గడచిన 48 గంటల్లో ఏకంగా ఎనిమిది ఏనుగులు మృత్యవాత పడ్డాయి. మంగళవారం వరకు ఏడు ఏనుగులు మృతి చెందగా, బుధవారం మరో ఏనుగు మృతదేహం లభ్యమైంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మధ్యప్రదేశ్ లో ఏనుగుల వరుస మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి. చివరి రెండు రోజుల్లో ఏకంగా 8 ఏనుగులు చనిపోయాయి. ఎందుకు చనిపోయాయి...ఎలా చనిపోయాయనేది ఇప్పుడు పెద్ద మిస్టరీ గా మారింది. టైగర్ రిజర్వ్‌లో గడచిన 48 గంటల్లో ఏకంగా ఎనిమిది ఏనుగులు మృత్యవాత పడ్డాయి. మంగళవారం వరకు ఏడు ఏనుగులు మృతి చెందగా, బుధవారం మరో ఏనుగు మృతదేహం లభ్యమైంది. దీంతో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారితో చర్చలు జరుపుతున్నారు. చనిపోయిన వాటిలో మూడు ఏళ్ల వయసు ఉన్న ఏడు ఆడ ఏనుగులు..మరో నాలుగేళ్ల వయసున్న మగ ఏనుగు ఉన్నాయి.
మొత్తం 13 ఏనుగులు అశ్వస్థతకు గురికాగా వాటిల్లో వైద్యసేవలు అందించిన పది ఏనుగులు ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. మరో మూడు ఏనుగులకు చికిత్స కొనసాగుతుంది. అయితే ఏనుగులు చనిపోవడానికి ప్రధాన కారణం పాయిజన్ గా రిపోర్ట్స్ ఉన్నాయి. ఏనుగు కళేబరాలు లభ్యమైన ప్రాంతాల్లోని పొలాలు, ఇళ్లలో వన్యప్రాణి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు ప్రాంతం ఐదు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందని తెలిపారు. ఎవరైనా కావాలని చేస్తున్నారా లేక ..పాయిజన్ కారణమేంటనేది రిపోర్ట్ అందించాలి.
మృతి చెందిన ఏనుగుల మల పదార్థం, మట్టి, సమీపంలోని మొక్కల నుండి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. మృతి చెందిన ఏనుగుల్లో ఎనిమిదింటిని పాతిపెట్టారు. 2021-23 మధ్యకాలంలో బాంధవ్ గర్ , షాహ్ దోల్ ప్రాంతాల్లో పెద్ద పులులు చనిపోయాయి. దాదాపు 43 పులులు చనిపోయాయి. అప్పుడు కూడా పె్ద దుమారమే లేపింది. ఇప్పుడు కూడా రిపోర్ట్ ఏం చెబుతారో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు .