భారీ వర్షం కారణంగా ఎయిర్ పోర్టు పైభాగం కూలిపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీలోని జబల్‌పూర్ ఎయిర్‌పోర్టు(Jabalpur airport)ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) పరిశీలించారు. విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పు(roof)లో కొంతభాగం కూలి, ట్యాక్సీలు సహా పలు కార్లపై పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్(hospital)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు(doctors) తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసు బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి.
కాగా, ప్రమాదం జరిగిన ఎయిర్‌పోర్టును పరిశీలించిన రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారిని పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. భారీ వర్షం కారణంగా ఎయిర్ పోర్టు పైభాగం కూలిపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. నాసిరకం మెటీరియల్‌తో ఎయిర్ పోర్టును నిర్మించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.