Kumbhe Waterfall: రీల్స్ చేస్తూ ఫేమస్.. రీల్స్ చేస్తూనే అనంత లోకాలకు..

 ఏముందో ఈ సోషల్ మీడియాలో ...ఫేమ్ కోసం యూత్ వేలం వెర్రిగా ప్రాణాలు కోల్పోతున్నారు. 


Published Jul 18, 2024 07:01:51 AM
postImages/2024-07-18//1721298970_SocialmediaInfluancer.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఏముందో ఈ సోషల్ మీడియాలో ...ఫేమ్ కోసం యూత్ వేలం వెర్రిగా ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు లైకులు , షేర్ల కోసం ప్రాణాలనే రిస్క్ లో పడేస్తున్నారు. ఫేమస్ యూట్యూబర్ ఆన్వీ ..వాటర్ ఫాల్స్ లో జారిపడిపోయి చనిపోయింది. వృత్తిరీత్యా ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అయిన ఆమె.. కొన్నాళ్లు ఓ సంస్థలో ఉద్యోగం చేసింది. ఉద్యోగ రీత్యా చాలా కంట్రీస్ లో ఉండేది. దీంతో అక్కడి వాతావరణం, షాపింగ్ , ప్రత్యేకమైన అంశాలపై వీడియోస్ చేసేది. అలా చేస్తూ చేస్తూ ఇప్పటికి లక్షల్లో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అయితే వర్షకాలంలో పర్యాటక ప్రాంతాలను చూపిస్తుంది . అంతా బాగున్నా...తన లైఫ్ లో మరొకటి రాసి ఉంచింది. వాటర్ ఫాల్స్ లో ఆన్వీ చనిపోయింది.


మహారాష్ట్రలోని ముంబయికి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దార్ (26) కుంభే జలపాతం వద్ద రీల్‌ చేస్తుండగా జారిపడి దుర్మరణం చెందింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబయిలో నివాసం ఉండే ఆన్వీ కామ్‌దార్‌ (26).. ఇన్‌స్టాగ్రామ్‌‌లో ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందారు.


కుంభే జలపాతానికి ఏడుగురు ఫ్రెండ్స్ తో వెళ్లింది.  అక్కడి ప్రకృతి అందాలను వీడియో తీసే క్రమంలో.. ఓ లోయకు అంచున ఆమె నిలబడ్డారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు జారిపడిన అన్వీ.. 300 అడుగుల లోతులో పడిపోయారు. వెంటనే చుట్టు ప్రక్కల వారు అలర్ట్ అయ్యారు. అయినా ఫలితం లేకపోయింది.. ఇన్‌స్టాలో ఆన్వీకి 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె రీల్స్, వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ఉన్నాయి. వృత్తిరీత్యా ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అయిన అన్వీ... డెలాయిట్‌లో పనిచేశారు. అంతే కాదు ఇన్‌స్టా బయోలో తనను తాను ట్రావెల్ డిటెక్టివ్‌గా రాసుకున్నారు. 


యువతి 300-350 అడుగుల లోతులో జారిపడింది.. ఆరు గంటల పాటు శ్రమించి లోయ నుంచి బయటకు తీసుకొచ్చాం’ అని తెలిపారు. కుంభే జలపాతం చాలా ఫేమస్ అంతే డేంజరస్ కూడా. మజా చెయ్యడమే కాదు ..సేఫ్టీ కూడా చూసుకోవాలంటున్నారు అధికారులు. నిజానికి మహారాష్ట్రలో హిల్ స్టేషన్స్ ఎక్కువ. అంతేకాదు రిస్క్ కూడా ఎక్కువే. అందుకే జలపాతాల దగ్గర కాస్త జాగ్రత్తగా  ఉండాలంటు కామెంట్లు చేస్తున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : viral-news water-bottle

Related Articles