ఏఐని సరిగ్గా వాడుకుంటే ఇంకా ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు. ప్రస్తుతం మనం వినియోగించే స్మార్ట్ మొబైల్స్ కూడా ఏఐ ఫీచర్లతో వచ్చేస్తున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ ఏవిధంగా పెరిగిందో మనం ఊహించలేం. అన్ని తెలుసుకున్నా మనకి తెలియని టెక్నాలజీ ఇంకా మిగిలే ఉంటుంది. ఈ కాలంలో మనిషి తలుచుకుంటే సైన్స్ సాయంతో ఏమైనా చేయగలడు. ఇప్పుడు మనిషి తెలివికి ఏఐ ఒకటి తోడు అయ్యింది.ఏఐని సరిగ్గా వాడుకుంటే ఇంకా ఎన్నో అద్భుతాలు చెయ్యొచ్చు. ప్రస్తుతం మనం వినియోగించే స్మార్ట్ మొబైల్స్ కూడా ఏఐ ఫీచర్లతో వచ్చేస్తున్నాయి.
తాజాగా ఒక రోబోకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రోబో అచ్చం రైతుల మారిపోతే ఎలా ఉంటుందో కనిపిస్తుంది. రైతులా మారి నాట్లు వేస్తుంది. హోటల్స్ లో కస్టమర్లకు సర్వ్ చేస్తూ ..డెలివరీ బాయ్ లా ఇలా రొబోను చూశాం కాని ...ఇలా రైతులా ఎప్పుడు చూడలేదు. ఈ వీడియోలో రోబోను రైతులా పొలంలో పనిచేస్తున్నట్లు వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో ఆ రోబోట్ పొలంలో పంటలకు నీరు పెట్టడం, పంటలు కోయడం వంటి ఒక రైతు చేయగలిగిన ప్రతి పనిని కూడా చేస్తోంది. కాని నిజానికి రోబోను ఇలా వాడుకునే అవకాశముంటే వ్యవసాయంలో విప్లవాలు క్రియేట్ చెయ్యొచ్చు. కాని వీడియోలు వచ్చిన రోబో ఏఐ రోబో ...క్రియేట్ చేయబడిన రోబో. ఇలాంటి AI రోబోలు వుంటే రైతులకు చాలా మేలు కలుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాని సైంటిస్టులు ఎందుకు ట్రై చేయడం లేదంటున్నారు నెటిజన్లు.
The Future of Agriculture pic.twitter.com/rMvJWcIpo1 — Interesting STEM (@InterestingSTEM) September 21, 2024