మెదక్, నర్సాపూర్ అడవుల్లో పర్యటించి అక్కడి కోతులకు అరటి పళ్ళు పంపిణీ చేశారు. అయితే అటవీ జంతువులకు బయట వ్యక్తులు ఆహారాన్ని అందించకూడదు అని రూల్ ఉంది.
న్యూస్ లైన్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కి నేటితో 60 ఏళ్లు. ఆయన పుట్టిన రోజు జరుపుకోవాలని ఆయన అనుచరులు సోమాజిగూడ కార్పొరేటర్ దంపతులు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మెదక్, నర్సాపూర్ అడవుల్లో పర్యటించి అక్కడి కోతులకు అరటి పళ్ళు పంపిణీ చేశారు. అయితే అటవీ జంతువులకు బయట వ్యక్తులు ఆహారాన్ని అందించకూడదు అని రూల్ ఉంది. కానీ ఆవి ఏం పట్టించుకోకుండా కోతులకు దంపతులు అరటి పళ్ళు పంపిణీ చేశారు. దీంతో వారిపై ఫారెస్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానం నాగేందర్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో ఆయనకే లేదో తెలియదు. ఒక రాజకీయ పార్టీ నుంచి మరో రాజకీయ పార్టీలోకి చాలా క్యాజువల్‌గా జంప్ చేస్తూ ఉండే వ్యక్తికి ఇది షష్టిపూర్తి వేడుకలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇటీవల దానం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయింపులపై హైకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా, ఆయన ఫిరాయింపుపై కేసు హైకోర్టులో ఉండగా.. ఉత్తర్వులు రిజర్వ్‌లో ఉన్నాయి.