Dr. Manmohan Singh : ఆర్థిక సంస్కర్త అస్తమయం !

డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు. 


Published Dec 26, 2024 11:32:50 PM
postImages/2024-12-27/1735277425_manmohansinghdismissed.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం కన్ను మూశారు. చాలా కాలంగా వయసు రీత్యా వచ్చే అనారోగ్యంతో మాజీ ప్రధాని , గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు.డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు. 


భారతదేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొనియాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని , మోక్షాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించినందుకు భారతదేశ ప్రజలకు యునైటెడ్ స్టేట్స్ తన సంతాపాన్ని తెలియజేస్తుంది. నిజానికి ఆర్ధిక వృధ్ధిని ప్రొత్సహించింది మన్మోహన్ సింగే. భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించిన మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపం తెలియజేశారు.


* దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి చెందడం తనకు చాలా బాధ కలిగించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అన్నారు. 


* మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మన్మోహన్ సింగ్ తెలివితేటలు, విధేయతతో దేశాన్ని నడిపించారు.


* ఆర్థిక శాస్త్రం పట్ల మన్మోహన్ రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. 


* ప్రపంచంలో విద్యారంగంలో, పరిపాలనలో సమాన సౌలభ్యంతో పనిచేసిన రాజకీయ నాయకులలో మన్మోహన్ సింగ్ ఒకరని ఆమె అన్నారు.


* మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించారు. మాజీ ప్రధాని 92 ఏళ్ల వయసులో మరణించారు.


* భారత ప్రభుత్వం డిసెంబర్ 27న జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది. అంతేకాకుండా 7 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu died manmohan-singh ex-pm

Related Articles