ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర రాష్ట్రం చాలా ఫేమస్. కానీ ఈ మధ్యకాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో యువత చాలా వరకు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. కొంతమంది మత్తు పదార్థాలకు బానిసలై పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఈశాన్య రాష్ట్రమైన త్రిపురాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉండేటువంటి వందలాది మంది స్టూడెంట్స్ కు హెచ్ఐవి పాజిటివ్ వచ్చినట్టు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు తెలియజేశారు. ఇందులో ఇప్పటికే 47 మంది చనిపోగా, 572 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర రాష్ట్రం చాలా ఫేమస్. కానీ ఈ మధ్యకాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో యువత చాలా వరకు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. కొంతమంది మత్తు పదార్థాలకు బానిసలై పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఈశాన్య రాష్ట్రమైన త్రిపురాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉండేటువంటి వందలాది మంది స్టూడెంట్స్ కు హెచ్ఐవి పాజిటివ్ వచ్చినట్టు స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు తెలియజేశారు. ఇందులో ఇప్పటికే 47 మంది చనిపోగా, 572 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
వీరంతా పేరు పొందినటువంటి పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులే. చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అక్కడ వీరికి ఎక్కువగా డ్రగ్స్, మత్తు పదార్థాలు అలవాటు కావడంతో ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలోనే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు, 220 పాఠశాలలు, 24 కాలేజీలు, యూనివర్సిటీలో టెస్టులు చేపట్టారు.
ఇందులో చాలామంది విద్యార్థులు డ్రగ్స్ ఇంజక్షన్లు తీసుకున్నట్టుగా తేలింది. అంతేకాకుండా ఇందులో ఎక్కువ మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్టు బయటకు వచ్చింది. అయితే డ్రగ్స్ తీసుకునే సమయంలో ఒకరి ఇంజక్షన్ మరొకరు వాడుతుండడంతో అందులో హెచ్ఐవి ఉన్న వ్యక్తుల నుంచి మరొకరికి సోకిందని అంటున్నారు. ఈ విధంగా అక్కడ ప్రతిరోజు 5 నుంచి 8 కొత్త హెచ్ఐవి పాజిటివ్ కేసులు నమోదవుతుండడం భయాన్ని కలిగిస్తోంది.