ఇండియా కూటమి తీరుపై ఎన్డీయే మండిపడుతోంది. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విపక్షాల అభ్యర్థులను నిలబెట్టడంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ, షరతుల ఆధారంగా మద్దతు ఇచ్చే ఆలోచనను మేము తిరస్కరిస్తున్నామని చెప్పారు.
న్యూస్ లైన్ డెస్క్: లోక్‌సభ స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్(deputy speaker)గా ఇండియా కూటమికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రతిపాదన చేశారు. అయితే, రాహుల్ ప్రతిపాదనపై అధికార పక్షం నుంచి ఎలాంటి స్పందన లేదు.
అధికార పక్షం తీరుపై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. యూపీఏ(UPA) హయాంలో ఎన్డీయే కూటమి(NDA Alliance)కి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చామని ఇండియా కూటమి నేతలు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవికి పోటీ చేస్తామని కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్(KC.Venugopal) స్పష్టం చేశారు. ఇండియా కూటమి తరపున కేరళ ఎంపీ కె.సురేష్ నామినేషన్ వేశారు. ఇదే జరిగితే స్పీకర్ పదవికి చరిత్రలోనే తొలిసారి ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ఇండియా కూటమి తీరుపై ఎన్డీయే మండిపడుతోంది. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విపక్షాల అభ్యర్థులను నిలబెట్టడంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ, షరతుల ఆధారంగా మద్దతు ఇచ్చే ఆలోచనను మేము తిరస్కరిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు షరతులతో మద్దతివ్వాలని మాట్లాడుతున్నాయన్నారు. లోక్‌సభ సంప్రదాయంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. లోక్‌సభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఏ పార్టీకి చెందినవారు కాదు, మొత్తం సభకు చెందినవారని ఆయన చెప్పుకొచ్చారు.