Anudeep – Suma : సుమ అడ్డాలో ...అనుదీప్ ..అన్న మళ్లొచ్చిండు !

ఆయన ఏం చదివాడనేది ఇప్పటికి మిస్టరీనే . ఒక్కసారే అనుకుంటే రెండో సారి కూడా సుమ క్యాష్ షోకి వెళ్లి మరోసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చాడు.


Published Mar 08, 2025 08:35:00 PM
postImages/2025-03-08/1741446576_0fc70ab8b28f3f0f35ba2332ee19a1631688899471070313original.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ తన సినిమాలతోనే కాదు బయటకూడా  తన మాటలతో ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తాడు. ముఖ్యంగా జాతిరత్నాలు ప్రమోషన్ అప్పుడు ఫుల్ వైరల్ అయ్యాడు. ఆయన ఏం చదివాడనేది ఇప్పటికి మిస్టరీనే . ఒక్కసారే అనుకుంటే రెండో సారి కూడా సుమ క్యాష్ షోకి వెళ్లి మరోసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ ఇచ్చాడు.


దీంతో అనుదీప్ కి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ వచ్చింది. ఆయన కామెడీ సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ రూపంలో బాగా వైరల్ అయింది. తాజాగా మరోసారి అనుదీప్ యాంకర్ సుమ షోకి వచ్చాడు. సుమ ప్రస్తుతం సుమ అడ్డా అనే షో చేస్తుంది. ఈ షోకి మ్యాడ్ స్క్వేర్ సినిమా మూవీ యూనిట్ వచ్చింది. ఈ మూవీలో అనుదీప్ కూడా చిన్న గెస్ట్ రోల్ చేశాడు. దీంతో ఈ టీమ్ తో అనుదీప్ కూడా సుమ అడ్డా షోకి వచ్చాడు.


తాజాగా సుమ అడ్డా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సారి కూడా అనుదీప్ తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. దీంతో ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అనుదీప్ వచ్చిన ఈ ఫుల్ ఎపిసోడ్ మార్చ్ 16 ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో టెలికాస్ట్ అవుతుంది. మీరు కూడా అనుదీప్ వచ్చిన సుమ అడ్డా ప్రోమో చూసేయండి.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu suma-kanakala jati-rathnalu-movie

Related Articles