దాడి జరగబోతోందని గమనించిన జర్నలిస్ట్ శంకర్ టీం అక్కడి నుంచి తప్పించుకొని వెల్డండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయం పోలీసులకుచెప్పడంతో స్టేషన్ సీఐ పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో జర్నలిస్టులను హైదరాబాద్‌కు పంపించారు.
న్యూస్ లైన్ డెస్క్: గురువారం సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడి జరిగింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయ రెడ్డిలపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో కూడా తమకు రక్షణ లేకుండా పోయిందని మహిళా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్ట్ శంకర్‌తో పాటు ఆయన టీంపై కూడా దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. దాదాపు 25 కిలో మీటర్ల వరకు శంకర్ వాహనాన్ని ఫాలో చేశారు.
అయితే, దాడి జరగబోతోందని గమనించిన జర్నలిస్ట్ శంకర్ టీం అక్కడి నుంచి తప్పించుకొని వెల్డండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జరిగిన విషయం పోలీసులకుచెప్పడంతో స్టేషన్ సీఐ పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో జర్నలిస్టులను హైదరాబాద్‌కు పంపించారు. అయితే, రుణమాఫీపై అసలు వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నించిన తమపై దాడి జరగడంపై జర్నలిస్టులు శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయానికి వెళ్లి జర్నలిస్ట్ శంకర్, సరిత ఆవుల, విజయారెడ్డి తదితరులు డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని.. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.