‘హరిత’ పార్లమెంటు నిర్మాణంలో భాగంగా లాబీ సహా భవనంలోని అనేక భాగాల్లో గాజు పైకప్పులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దాని ద్వారా పగటిపూట సూర్య కాంతిని వినియోగించుకుని కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
న్యూస్ లైన్ డెస్క్: పార్లమెంట్ భవనంలోని లాబీలో వాటర్ లీక్ అయిన ఘటనపై లోక్‌సభ సెక్రటేరియట్ స్పందించింది. లాబీకి చెందిన గాజు పైకప్పు నిర్మాణంలో అతికించే పదార్థం కొద్దిగా పక్కకు జరగడంతో లీకేజీ సంభవించినట్లు తెలిపింది. వెంటనే సమస్యను గుర్తించి, చర్యలు తీసుకోవడంతో పాటు మకర ద్వారం ముందు ఉన్న నీటిని తోడేసినట్లు వెల్లడించింది.
‘హరిత’ పార్లమెంటు నిర్మాణంలో భాగంగా లాబీ సహా భవనంలోని అనేక భాగాల్లో గాజు పైకప్పులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దాని ద్వారా పగటిపూట సూర్య కాంతిని వినియోగించుకుని కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
కాగా, రాష్ట్రపతి ఉపయోగించిన పార్లమెంట్ లాబీలో నీళ్లు లీక్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఓ ప్లాస్టిక్ బకెట్ పెట్టి సిబ్బంది నీటిని పట్టారు. అయితే, భావన నిర్మాణం జరిగి ఒక సంవత్సరమే అయింది. అప్పుడే భవనం లీక్ అవ్వడంతో.. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విపక్ష నేతలు సైతం ఈ అంశంపై లోక్‌సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే, దీన్ని స్పీకర్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.