ఈ సందర్భంగా అరకు కాఫీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఉత్పత్తి చేయడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(AP)లోని విశాఖపట్నం(Visakhapatnam)లో లభించే అరకు కాఫీ(araku coffee)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం 'మన్ కీ బాత్'(Maan Ki Baat) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అరకు కాఫీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఉత్పత్తి చేయడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుందని అన్నారు.
దేశంలో చాలా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్‌లో ఉన్నాయి. భారతదేశం(India)లోని ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తం కావడం చూసినప్పుడు గర్వపడటం సహజమని అన్నారు. అలాంటి ఉత్పత్తి అరకు కాఫీ అని కొనియాడారు. అల్లూరి సీతా రామరాజు జిల్లాలో అరకు కాఫీ అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుంది.
మంచి రుచి, సువాసనకు ఈ కాఫీ ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. అరకు కాఫీకి అనేక గ్లోబల్ అవార్డులు(Global awards) వచ్చాయని మోడీ తెలిపారు. ఢిల్లీ(Delhi)లో జరిగిన జీ20 సమ్మిట్‌లోనూ ఈ కాఫీకి మంచి ఆదరణ లభించింది. అరకు కాఫీ సాగుతో దాదాపు 1.5 లక్షల గిరిజన కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని తెలిపారు. ఓసారి సీఎం చంద్రబాబు(Chandrababu)తో కలిసి ఈ కాఫీని రుచి చూసే అవకాశం తనకు లభించిందని మోడీ గుర్తు చేసుకున్నారు.