Nani: " హిట్ -3" నుంచి కొత్త పోస్టర్ ...ఊరమాస్ లుక్ లో కిర్రాక్ గా నాని !

ఈ పోస్టర్ కు లోడెడ్ అండ్ కుక్ డ్ అంటూ క్యాప్షన్ ఇచ్చి మరో 30 రోజుల్లో హిట్ -3 వస్తుందని పేర్కొన్నారు.


Published Apr 01, 2025 07:23:00 PM
postImages/2025-04-01/1743515676_hq720.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నేచురల్ స్టార్ నాని , డైరక్టర్ శైలేశ్ కొలను కాంబోలో వస్తున్న రీసెంట్ మూవీ " హిట్ " ది థర్డ్ కేస్ మే 1 న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు , టీజర్లు మూవీ పై అంచనాలను భారీగా పెంచేశాయి. రీసెంట్ గా నాని మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్  లో చేతిలో స్టైలిష్ గా గన్ పట్టుకొని సిగరెట్ కాలుస్తూ నాని ఊరమాస్ లుక్ లో కిర్రాక్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ కు లోడెడ్ అండ్ కుక్ డ్ అంటూ క్యాప్షన్ ఇచ్చి మరో 30 రోజుల్లో హిట్ -3 వస్తుందని పేర్కొన్నారు.


ఇక ఈ సినిమాలో శైలేశ్ కొలను హీరో నానిని విభిన్నంగా చూపించబోతున్నారు. ఇప్పటికే కశ్మీర్ ప్రాంతంలో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. " కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news nani hit-2

Related Articles