ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే మూవీ నుంచి చాలా పోస్టర్లు, పాటలు , లుక్ లు చాలా రిలీజ్ అయ్యాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప -2 ది రూల్ ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే మూవీ నుంచి చాలా పోస్టర్లు, పాటలు , లుక్ లు చాలా రిలీజ్ అయ్యాయి.
ఇలా ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుంచి ఒకో సాంగ్ ఒక దాన్ని మించి మరొకటి హిట్ కాగా రీసెంట్ గా అయితే ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ క్రేజీ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. మలయాళ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన ఆ పాటనే 'పీలింగ్స్'. అన్ని భాషల్లోనూ ఈ సాంగ్ పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉండనున్నాయి.
దీంతో మలయాళ బీట్స్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇ్చిన పాటలు ఒక్కటే ఓ రేంజ్ లో జనానికి ఎక్కేశాయి. ఇప్పుడు మరో పాట రిలీజ్ చేశారు మూవీ టీం. అది కూడా అభిమానులకి ఇపుడు సాలిడ్ ప్రోమోతో విడుదల తేదీ వచ్చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ సాంగ్‌ను డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సాంగ్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాలి.