PM Modi in Odisha: ప్రధాని మోదీ పుట్టినరోజు ఎక్కడ జరుగుతుందంటే ?

మోదీజీ కి  ఒడిస్సా మహిళలు సాంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికారు.వారి ఇంటిలో ప్రధాన మంత్రి పూజ చేశారు. వారందించిన జగన్నాథుడిని చిత్రపటాన్ని, పాయసాన్ని స్వీకరించారు.


Published Sep 17, 2024 01:56:00 PM
postImages/2024-09-17/1726561713_PMModi1e92d06c5ff.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తన పుట్టినరోజును ఓ ప్రత్యేకమైన ప్లేస్ లో జరుపుకుంటున్నారు . తన పుట్టినరోజు సంధర్భంగా ప్రధాని మంత్రి ఒడిస్సాను సందర్మించారు. అక్కడ భువనేశ్వర్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేటాయించిన ఇళ్లను ఆయన స్వయంగా సందర్మించారు. మోదీజీ కి  ఒడిస్సా మహిళలు సాంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికారు.వారి ఇంటిలో ప్రధాన మంత్రి పూజ చేశారు. వారందించిన జగన్నాథుడిని చిత్రపటాన్ని, పాయసాన్ని స్వీకరించారు.


 ప్రధాని మోదీతో పాటు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చంరణ్‌ మాఝీ కూడా ఉన్నారు. మహిళల కోసం ఒడిశా ప్రభుత్వం చేపట్టిన సుభద్ర పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన వారికి ఒడిస్సా ప్రభుత్వం ఏటా రెండు వాయిదాల్లో ఐదు వేల చొప్పున మొత్తం పదివేల రూపాయలు చెల్లిస్తారు. ఏటా రాఖీ పండగ రోజు ఒకసారి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మరో విడత చెల్లిస్తారు. 


అయితే 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలు ఈ పథకం కింద అర్హులు. ఈ పథకంలో దాదాపు ఇప్పటికే 50 లక్షల మంది మహిళలు తమ పేర్లు నమోదుచేసుకున్నారు.గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అత్యధిక డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించే వంద మంది లబ్దిదారులకు అదనపు ఇన్సెంటివ్‌గా ఐదొందలు చెల్లిస్తారు. దీని వల్ల లక్షల్లో మహిళలు లబ్ధిపొందుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu narendra-modi birthday puri-jagannadh

Related Articles