ఈ కార్డు ఉందా 5 లక్షల వరకు ఉచిత వైద్యం.. అప్లై చేయండిలా.?

ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో చెప్పడం కష్టంగా ఉంది. డబ్బున్న వాళ్లకైతే ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి డబ్బులు చెల్లించి వైద్యం


Published Sep 14, 2024 12:21:38 PM
postImages/2024-09-14/1726296698_PMJAY.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో చెప్పడం కష్టంగా ఉంది. డబ్బున్న వాళ్లకైతే ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటారు. అలా డబ్బులు లేని పేదల పరిస్థితి ఏంటని చాలామంది చింతిస్తూ ఉంటారు.  కానీ అలాంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి స్కీములు తీసుకువచ్చి ఐదు లక్షల వరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి చికిత్స చేసుకోవడానికి ఫెసిలిటీ అందిస్తోంది.  

దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 2018 లోనే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా పేద ప్రజలకు ఐదు లక్షల వరకు ఉచిత మెడికల్ కవరేజ్ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం లేదు.  అంతేకాకుండా మీరు ఇండియాలోని ఏదైనా రిజిస్టర్డ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా ఇండియా అంతట  కలిసి 10.74 కోట్ల కుటుంబాలకు అవసరం తీర్చనుంది. మీరు ఖర్చుల గురించి భయపడకుండా ఆరోగ్యానికి కాపాడుతోంది.

 కార్డు పొందే విధానం:
 ఈ యొక్క ఆయుష్మాన్ కార్డు పొందాలంటే కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు అవసరమవుతాయి.  రేషన్, ఆధార్, ఓటర్ ఐడి కార్డులు, కావాలి. ఎఈసిసి డేటా ప్రూఫ్ కూడా ఉండాలి. అంటే మీ పేరు సామాజిక ఆర్థిక కులగనన 2011 జాబితాలో ఉంటే స్కీం అర్హత పొందుతారు. ఇదే కాకుండా మీరు మొబైల్ నెంబర్, బ్యాంకు పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా కలిగి ఉండాలి. అలాగే మీ కుటుంబం యొక్క వార్షికఆదాయం 5 లక్షలు మించరాదు. దరఖాస్తు చేయడానికి   https://pmjay.gov.in లింక్ ఓపెన్ చేసి యాప్ లో ఐ ఎలిజిబుల్.. అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంచుకొని  ఆధార్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. 

 మీ యొక్క రిజిస్టర్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి మీ కుటుంబ వివరాలు నింపండి. ఆ తర్వాత కావలసిన డాక్యుమెంట్లు  అప్లోడ్ చేసి పామ్ సమర్పించి కన్ఫర్మేషన్ కోసం వేచి చూడండి. అలా అన్నీ అయిపోయిన తర్వాత ఆయుష్మాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పై కార్డు వచ్చిన తర్వాత 1400 సంబంధించి చికిత్స చేసుకోవడానికి 5 లక్షల వరకు బీమా ఉంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu centralgovernment ayushman-bharat health-benifits hospital pm-modi health-card

Related Articles