tolls: టోల్స్ తగ్గించిన కేంద్రం.. టోల్ ఛార్జీలు ఇక పై తక్కువే !

ఉపగ్రహ ఆధారిత సిస్టమ్ లో టోల్ ఫీజు వసూలు కోసం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ , అన్ బోర్డ్ యూనిట్ ఉపయోగపడుతందని అంటున్నారు.


Published Sep 12, 2024 11:03:00 PM
postImages/2024-09-12/1726162465_94158faed2cf2dc8b8168b7bb82d33791710233224038314original.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇటీవల దేశ వ్యాప్తంగా జాతీయ రహాదారులపై ఉన్న టల్స్ నచ్చినట్లు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అందుకే కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది.రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త టోల్ వసూళ్లు, గ్లోబల్ నావిగేషన్ శాలిటైట్ సిస్టమ్  కొత్త విధానాన్ని ప్రకటించింది. ఉపగ్రహ ఆధారిత సిస్టమ్ లో టోల్ ఫీజు వసూలు కోసం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ , అన్ బోర్డ్ యూనిట్ ఉపయోగపడుతందని అంటున్నారు. ఈ నిర్ణయాన్ని ఎక్స్ ప్రెస్ వేలో అమలు చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే చాలా వరకు ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఉంది.


ప్రైవేట్ వాహనాలకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ట్యాక్స్ విధించకూడదని నిర్ణయించింది. బెంగుళూరు – మైసూరు పరిధిలోని ఎన్ హెచ్ – 275 పై ఈ విధానం అమలుకు సంబంధించి విధానం చాలా హెల్ప్ అవుతుంది . ఈ విధానం ప్రకారం హైవైపై మీ వాహనం 30 కిలో మీటర్లు ప్రయాణిస్తూ కేవలం 10 కిలోమీటర్లకు మాత్రమే టోల్ ఫీజ్ కడితే సరిపోతుంది. ఇంతకు ముందు 30 కిమీ టోల్ కు డబ్బు కట్టేవారు. ఇఫ్పుడు 20 కిమీ ఫ్రీ.


 ఇకపై నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ తో యూనిట్ కలిగి ఉన్న వాహనాలు టోల్ గేట్ల మీదుగా వెళ్లినపుడు ఆ వాహనం ప్రయాణించిన దూరానికే టోల్ ఫీ ఆటోమెటిక్ గా కట్ అయిపోతుంది. మీరు ఆగాల్సిన అవసరం లేదు. డ్రైవర్ల కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది.పెద్దగా ట్రాఫిక్ జామ్ ఉండదు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu centralgovernment

Related Articles