మండల శాఖ అధ్వర్యంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో BRS కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో BRS కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో మండల శాఖ అధ్వర్యంలో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో BRS కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
మరోవైపు, కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో కూడా BRS పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. నిండు అసెంబ్లీ సభలో తెలంగాణ ఆడబిడ్డను అవమానించిన సీఎం వెంటనే రాజీనామా చేయాలని నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ అన్నారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అక్కడికి చేరుకున్న పోలీసులు.. దిష్టి బొమ్మ దహనం చేయడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.