RBI: గోల్డ్ లోన్స్ తీసుకున్న వాళ్లకి గుడ్ న్యూస్ .. ఈజీ గా కట్టే పధ్దతి !

గోల్డ్ లోన్ లని ఈఎంఐ ప్రాసెస్ లో తీర్చేసే ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురావాలని RBI ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Published Nov 20, 2024 04:27:00 PM
postImages/2024-11-20/1732100292_golggsixteennine.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గోల్డ్ చాలా మందికి ఇన్వెస్టిమెంట్ ..మరికొంత మందికి అది అలంకరణ ..ఏదైనా బంగారం ఆర్ధికంగా చాలా మందికి అవసరమవుతుంది. ఇది ఒప్పుకోవల్సిందే. నిజానికి జీవితంలో నిలదొక్కుకోవాలనుకున్న ప్రతి సారి ..ఎంతో కొంత ఆర్ధికంగా నిలబెట్టేది బంగారమే. చాలా మంది బ్యాంకుల్లో బంగారం పెట్టి డబ్బులు తీసుకుంటు ఉంటారు. మళ్లీ తిరిగి పొందేందుకు చాలా కష్టపడాల్సిందే. అయితే అలాంటి వారికి ఆర్బీఐ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. అతి త్వరలోని గోల్డ్ లోన్ లని ఈఎంఐ ప్రాసెస్ లో తీర్చేసే ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకురావాలని RBI ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం గోల్డ్ తీసుకొని లోన్లు ఇచ్చే సంస్థలు కానీ బ్యాంకులు కానీ కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ ఇస్తున్నాయి. అంటే లోన్ టెన్యూర్ పూర్తయిన తర్వాత మనం మొత్తం లోన్ ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. లేదంటే టెన్యూర్ కంటే ముందే మన దగ్గర డబ్బులు ఉంటే అసలు వడ్డీ కట్టి విడిపించుకోవాలి.


 బంగారం విలువను లెక్క కట్టే విషయంలో లోపాలు, వేలం సరిగ్గా లేకపోవడం వంటి తప్పులను RBI గుర్తించింది. చాలా మంది ఏడాదికి ఒక సారి డబ్బు కట్టి మళ్లీ లోన్ ను అలానే కంటిన్యూ చేస్తున్నట్లు తెలుసుకుంది ఆర్బీఐ . అందుకే ఇలా EMI ద్వారా గోల్డ్ లోన్ లను తీర్చుకునే సౌకర్యాన్ని ప్రజలకు అందించాలని RBI డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. గోల్డ్ లోన్ ఈ ఎంఐ పధ్ధతిపై మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఎప్పుడు అమలులో ఉంటుంది. డీటైల్స్ ను మరికొన్ని రోజుల్లో తెలియజేస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu gold emi bank-loan bank-rules-

Related Articles