AM RAJGOPALAN : 101 పుట్టినరోజు జరుపుకున్న వేదపండిట్ ఏఎంఆర్ రాజగోపాల్ !

ప్రముఖ ఆస్ట్రాలజీ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు AMరాజగోపాలన్ కుముతం ఈ రోజు 101 పుట్టినరోజును జరుపుకున్నారు.  


Published Aug 24, 2024 06:48:00 PM
postImages/2024-08-24/1724505662_NewProject20240814T184745.607.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ ఆస్ట్రాలజీ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు AMరాజగోపాలన్ కుముతం ఈ రోజు 101 పుట్టినరోజును జరుపుకున్నారు.  మొత్తం నాలుగు కార్యక్రమాలకు గాను ఆయన ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. సహస్ర చంద్రదర్శనం, సతజయంతి , 85 యేళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా ఈ కార్యక్రమం చేసుకున్నారు.


AM రాజగోపాలన్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లాంటి పత్రికల్లో పనిచేసిన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్  అంతే కాదు ఎన్నో వందల దేవాలయాలను శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు, గోపురాలను తిరిగి పునః నిర్మించారు కూడా. అయితే రాజగోపాలన్ తన 101 వ పుట్టినరోజును చెన్నై లో జరుపుకున్నారు. ఈ సంధర్భంగా తన భార్యకు నాల్గవసారి మంగళసూత్రం కట్టి తన వైవాహిక జీవితం ఎంత ఆనందంగా ఉందో తెలిపారు.


గతంలో షష్టి పూర్తి చేసుకొని తన భార్యకు మంగళసూత్రం కట్టారు. ఇప్పుడు , పెళ్లి సమయంలో శతాభిషేక సంధర్భంలో ఇలా నాలుగు సంధర్భాల్లో రాజగోపాలన్ తన భార్యకు మంగల్యధారణ చేశారు. తన 84 యేళ్ల విజయవంతమైన వివాహంతో తను చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం తన వారసత్వానికి , నిబద్దతకు నిదర్మనంగా ఉండాలన్నారు. తన తర్వాత తరాల వారు ..ఇంతే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu journalist birthday chennai

Related Articles