సోలో లైఫే సో బెటరు..సింగిల్స్ బీ...కింగ్స్ ..ఎన్ని పాటలు వచ్చినా ..సింగిల్స్ కి మాత్రమే లైఫ్ ని ఎంజాయ్ చేయగలం. పెళ్లయితే బాధ్యతలే చాలు. సింగిల్స్ గా ఉండడం వల్ల బోలెడు లాభాలున్నాయి. అవేంటో చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సోలో లైఫే సో బెటరు..సింగిల్స్ బీ...కింగ్స్ ..ఎన్ని పాటలు వచ్చినా ..సింగిల్స్ కి మాత్రమే లైఫ్ ని ఎంజాయ్ చేయగలం. పెళ్లయితే బాధ్యతలే చాలు. సింగిల్స్ గా ఉండడం వల్ల బోలెడు లాభాలున్నాయి. అవేంటో చూసేద్దాం.
ఫ్రీడమ్ : సన్ ఫ్లవర్ ఆయిల్ కాదు ..ఫ్రీడమ్ స్వతంత్ర్యం. పెళ్లి చేసుకుంటే మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు గడపలేం. మీరు ఎక్కడ నివసించాలి, ఏం చేయాలి, ఎవరితో కలిసి ఉండాలి అనే నిర్ణయాలు మీవే. మీకు నచ్చిన టైంలో రావచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు , మిమ్మల్ని ఎవ్వరు ఆర్డర్ చెయ్యరు.
పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పెళ్లి చేసుకోకపోతే మీరు మీ ఆదాయాన్ని మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయవచ్చు. మీకు బాధ్యతలుండవు ...కాని ఖర్చులు తక్కువ...ట్రిప్స్ కి వెళ్లొచ్చు.
ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చెయ్యొచ్చు. కావాల్సిన టైంలో రెస్ట్ తీసుకోవచ్చు. అసలే ఫ్యామిలీ బాధ్యతలుండవు కాబట్టి మీ ఫ్రెండ్స్ తో జాలీగా ఎంజాయ్ చెయ్యొచ్చు.
మీరు కెరియర్ చాలా అధ్భుతంగా ప్లాన్ చేసుకోవచ్చు. పిల్లల ఖర్చులు ..భార్య ఖర్చులు ఉండవు సో ...మీ ఫైనాన్షియల్ పరిస్థితులు బాగుంటాయి. కొంతమందికి పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు
పెళ్లి చేసుకోకపోతే సమాజంలో కొంతమంది నుండి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది . అయితే సింగిల్ గా ఉంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మీ స్నేహితులంలదరికి పెళ్లి అయ్యి పిల్లలుంటారు. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవచ్చు. పెళ్లి, లైఫ్ ఇవన్నీ అనవసరం అనిపించినా ముసలితనంలో ఫ్యామిలీ చాలా హెల్ప్ అవుతుంది. ఆశయాలు లాంటివి ఏమైనా ఉంటే పెళ్లి చేసుకోకండి.