Residential: ఈ పిల్లల బాధలు తెలిస్తే మీకు కన్నీళ్లు వస్తాయి..!

అవి తిన్న విద్యార్ధులు  ఫుడ్ పాయిజన్, అనారోగ్యంతో హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. ఇదేదో ఒక్క చోటో, లేక ఒక్కరోజు జరిగింది కాదు. నిత్యం జరుగుతూనే ఉంది. 


Published Aug 05, 2024 04:47:32 AM
postImages/2024-08-05/1722851202_hospital.jpg

న్యూస్ లైన్, హైదరాబాద్:  రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన అన్నం పెడుతుండటంతో పిల్లలను గురుకులాలకు పంపాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఒక్కచోట అని కాదు దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి. పురుగులు పట్టిన అన్నం, కుళ్లిన కూరగాయలు, కుళ్లిపోయిన కోడిగుడ్లతో నిత్యం పిల్లలకు ఫుడ్ పెడుతున్నారు. అడిగితే కొట్టి మరీ చిత్రహింసలు పెడుతున్నారు. దీంతో పిల్లలు చెప్పుకోలేక, దాచుకోలేక నరకం అనుభవిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కడుపు మాడ్చుకోలేక తింటున్నారు. అవి తిన్న విద్యార్ధులు  ఫుడ్ పాయిజన్, అనారోగ్యంతో హాస్పిటల్స్‌లో చేరుతున్నారు. ఇదేదో ఒక్క చోటో, లేక ఒక్కరోజు జరిగింది కాదు. నిత్యం జరుగుతూనే ఉంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 16 మంది విద్యార్ధినీలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వీరేచనాలు కావడంతో వారిని కొల్లాపూర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వాళ్లంతా సేఫ్ గానే ఉన్నారు.

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పురుగుల అన్నం, నీళ్ల చారు పోస్తున్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, కనీస అవసరాలకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి. దీంతో రెండు, మూడు రోజులకోసారి స్నానం చేయాల్సిన పరిస్థితి. ఉడికి ఊడకని అన్నం పెట్టడంతో అది తిన్న పిల్లలు కడుపునొప్పితో బాధపడుతున్నారు. హాస్టల్ లో పిల్లలను చూసేందుకు వెళ్లిన పేరెంట్స్ ముందు పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పిల్లల దీనస్థితిని చూసి తల్లిదండ్రులు సైతం తల్లడిల్లిపోతున్నారు.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేర మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ గురుకులంలో కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నిత్యం ఇలాంటి ఫుడ్ పెడుతున్నారని వాపోయారు. అధికారులు పట్టించుకోలని కోరారు. లేదంటే వాళ్లు వండింది తినలేక, ఆకలి బాధలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికితో తోడు ఇటీవల స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోనే విద్యార్ధినీలు రోడ్డెక్కిన పరిస్థితి. సరిగా ఫుడ్ పెట్టడం లేదని నిరసన తెలిపారు. 

రాష్ట్రంలో గురుకులాలంటే ఒకప్పుడు బ్రాండ్. అందులో మన పిల్లలు చదువుతున్నారంటే చాలా గ్రేట్ అనిపించేది. మంచి చదువు, హెల్దీ ఫుడ్ దొరుకుతోందని చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించారు. ఆర్థిక స్థోమత లేనివాళ్లే కాదు, ఆర్థికంగా సెటిల్ అయినా వాళ్లు కూడా తమ పిల్లలను గురుకులాలకే ప్రియారిటీ ఇచ్చి చదివిస్తున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. గురుకులాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. నిత్యం జరుగుతున్న సంఘటనలతో పిల్లలే కాదు, పేరెంట్స్ సైతం భయపడితున్నారు. తినడానికి తిండి లేకపోతే అడుక్కోనైనా తిందాం కానీ, గురుకులాలకు వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఇలా తయారయ్యాయి. ఇన్నాళ్లు అద్భుతంగా నడిచిన హాస్టల్స్ ఇప్పుడేందుకు అద్వాన్నంగా మారుతున్నాయనేవి అందరిలో మదిలో మెదులుతున్న ప్రశ్నలు.

 

newsline-whatsapp-channel
Tags : india-people news-line newslinetelugu students telanganam residentialschool

Related Articles