పాలు , పంచదార ,సేమియాతో ఈ మ్యాంగో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మామిడిపండ్లతో చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : చాలా స్వీట్స్ తిని ఉంటాం కాని ఈ మ్యాంగో పాయసం ఎప్పుడైనా టేస్ట్ చేశారా . పూజలు, బర్త్డే, పెళ్లి రోజు వంటి స్పెషల్ అకేషన్స్ అప్పుడు చాలా మంది దీనిని తయారు చేస్తుంటారు. పాలు , పంచదార ,సేమియాతో ఈ మ్యాంగో పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మామిడిపండ్లతో చేసే ఈ పాయసం రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా చాలా తక్కువ సమయంలో ఎంతో రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
నెయ్యి - తగినంత
జీడిపప్పులు - 10
కిస్మిస్ - కొన్ని
సేమియా - అర కప్పు
చిక్కటి పాలు - 1 లీటర్
సగ్గుబియ్యం - పావు కప్పు
పంచదార - రుచికి సరిపడా
యాలకులపొడి - 1 టీస్పూన్
కుంకుమ పువ్వు - చిటికెడు
మామిడి గుజ్జు - 3 కప్పులు
తయారీ విధానం: ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి సరిపడా నీళ్లు పోసి సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకొని చల్లగా అవ్వనివ్వండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి కరిగించుకొండి. కరిగిన నెయ్యిలో జీడిపప్పులు వేసి వేయించాలి. కాజూ దోరగా వేగిన తర్వాత కిస్మిస్లు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఓ ప్లేట్లోకి తీసుకొండి. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి , సేమ్యా వేసి లో ఫ్లేమ్ లో రంగు మారే వరకు కలుపుతూ వేయించాలి.
సేమ్యా మంచిగా వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడే అదే స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి చిక్కటి పాలు పోసి మరిగించాలి. పాలు ఓ పొంగు రానివ్వండి. అందులో సేమ్యా వేసి ఉడికించండి.సేమియా కాస్త ఉడుకుబట్టిన తర్వాత ముందుగా ఉడికించిన సగ్గుబియ్యం వేసి మరికొద్దిసేపు కుక్ చేసుకోవాలి.
ఆ తర్వాత రుచికి సరిపడా పంచదార వేసి పూర్తిగా కరిగించాలి. అనంతరం యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. లాస్ట్ లో జీడిపప్పు వేసుకొని ఉంచుకొండి.ఈలోపు బాగా పండిన మామిడిపండ్లను తీసుకుని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి కొలతల ప్రకారం మూడు కప్పులు ఉండేలా చూసుకోవాలి. మీరు ముందుగా చేసుకున్న సేమ్యాను ఈ మ్యాంగో పండు గుజ్జు వేసి కలుపుకొండి. ట్రస్ట్ మీ పుల్లగా , తియ్యగా అధ్భుతంగా ఉంటుంది.