Platform Fee Hike: కస్టమర్లకు ఉమ్మడిగా షాకిచ్చిన జొమాటో, స్విగ్గీ!

మొదట రూ.2గా ఉన్న ఫీజును విడతల వారీగా ఇప్పటి కి ఆరు రూపాయి చేశారు. ఏప్రిల్‌లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి రూ.5గా చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ నగరాలను పెంపును వర్తింపజేసింది. ఫాస్ట్ డెలివరీ కావాలంటే.. స్పెషల్ ప్రైస్ కట్టాల్సిందే. 

Published Jul 15, 2024 12:51:00 PM
postImages/2024-07-15/1721028130_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ , జొమోటోలు కంబైండ్ గా..షాకిచ్చాయి. ఢిల్లీ , బెంగుళూరు లాంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ ఫామ్ ఫీజును ఇక పై రూ..6 చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5 గా వసూలు చేశారు. ఇది ఇప్పుడు రూపాయి పెంచింది. దీంతో, ఫ్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం మేర పెంచినట్టైంది. అయితే, బెంగళూరులో ఫీజును స్విగ్గీ తొలుత రూ.7గా పేర్కొని ఆ తరువాత రాయితీ ఇచ్చి రూ.6గా చేసింది. 

మొదట రూ.2గా ఉన్న ఫీజును విడతల వారీగా ఇప్పటి కి ఆరు రూపాయి చేశారు. ఏప్రిల్‌లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి రూ.5గా చేసింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లఖ్‌నవూ నగరాలను పెంపును వర్తింపజేసింది. ఫాస్ట్ డెలివరీ కావాలంటే.. స్పెషల్ ప్రైస్ కట్టాల్సిందే. 

ఒక్కో ఆర్డర్ పై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్‌ల లక్ష్యం. బెంగళూరులో బ్లింకిట్ ఒక్కో ఆర్డర్‌పై రూ.4, ఇన్‌స్టా మార్ట్‌ రూ.5 వసూలు చేస్తోంది.ఢిల్లీలో ఈ చార్జీలు వరుసగా రూ.16, రూ.4గా ఉన్నాయి.  మరోవైపు, కొన్ని సమయాల్లో ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల సర్జ్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. టాటా గ్రూపునకు చెందిన బీబీనౌ రూ. 99పైన విలువ చేసే ఆర్డర్లపై రూ.5 హ్యాండ్లింగ్ చార్జీలు వసూలు చేస్తోంది. ఇప్పుడు మూకుమ్మడిగా ఛార్జీలు పెంచే ప్రయత్నాలు చేస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu platform-ticket

Related Articles