Puja Khedkar : పూజా ఖేడ్కర్ ట్రైనింగ్ నిలిపేస్తూ అధికారుల ఆదేశాలు

వివాదాలకు చిరునామాగా మారిన ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ విషయంలో ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. అడ్డదారులో ఐఏఎస్ ఉద్యోగం సంపాదించారంటూ ఆమె మీద వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ మొదలు పెట్టారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721136153_Poojakhedkhar.jpg

న్యూస్ లైన్ డెస్క్ :  తప్పుడు పద్ధతుల్లో ఐఏఎస్ ఉద్యోగం సాధించి శిక్షణ పొందుతున్న పూజా ఖేడ్కర్ వెంటనే ట్రైనింగ్ ఆపేసి వెనక్కి రావాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముస్సోరిలోని లాల్ బహుదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆప్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి రావాలని పిలిచారు. పూజా ఖేడ్కర్ యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల  నేపథ్యంలో రిక్రూట్ మెంట్ కి సమస్య కాకుండా ఉండేందుకు అధికారులు ఆమెను వెనక్కి పిలిచారు. మహారాష్ర్టలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా ఖేడ్కర్ను రిలీవ్చేస్తూ జనరల్ అడ్మినిస్టర్షన్ విభాగం ప్రకటించింది. ఆమె యూపీఎస్సీకి సమర్పించిన పత్రాలపై దర్యాప్తు జరుగుతోంది.

 

newsline-whatsapp-channel
Tags : viral-news ias-officer trainee-ias-

Related Articles