delhi: ఢిల్లీ ట్రైన్లు పేర్లు ఒకలా ఉండడం వల్లే ఈ ప్రమాదం !

తమ ట్రైన్ అనుకొని ప్రయాణికులు వేరే ప్లాట్ ఫామ్ దగ్గరకు దూసుకెళ్లారని చెప్పారు. అంతేకాకుండా చాలా ట్రైన్స్ లేటు రావడం కూడా ఈ ఘటన జరగడానికి కారణమని తెలిపారు.


Published Feb 16, 2025 04:43:00 PM
postImages/2025-02-16/1739704493_173969820030.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రయాగ్ రాజ్ వెళ్లే ట్రైన్ల పేర్లు దాదాపు ఒకేలా ఉండడమే ఢిల్లీ రైల్వే స్టేషన్లు తొక్కిసలాటకు దారి చేసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ , ప్రయాగ్ రాజ్ స్పెషల్ ట్రైన్ల పేర్లతో ప్రయానికులు గందగోళానికి గురయ్యారు. దీని వల్ల అనౌన్స్ మెంట్ తో ప్రయాణికులు తమ ట్రైన్ అనుకొని ప్రయాణికులు వేరే ప్లాట్ ఫామ్ దగ్గరకు దూసుకెళ్లారని చెప్పారు. అంతేకాకుండా చాలా ట్రైన్స్ లేటు రావడం కూడా ఈ ఘటన జరగడానికి కారణమని తెలిపారు.


14వ ప్లాట్​ఫామ్​కు బదులు తమ ట్రైన్​ 16వ ప్లాట్​ఫామ్​ పైకి వస్తుందనుకుని అటువైపు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఫుట్​ ఓవర్​ బ్రిడ్జిపై ఒక్కసారిగా జనం గుమిగూడారు. ఫుట్ ఒవర్ బ్రిడ్జ్ పై ఒక్కరు అదుపుతప్పి పడిపోయారు. దీంతో చాలా మంది పడిపోడి తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు.ప్రతి గంటకు 1,500 సాధారణ టిక్కెట్లను రైల్వే విక్రయించింది. చాలా రష్ గా ఉండడం వల్ల పరిస్థితి అదుపు చెయ్యలేకపోయారని అధికారులు తెలిపారు. ప్రయాగ్​రాజ్​కు వెళ్లాల్సిన 4 రైళ్లలో మూడు ఆలస్యం అయ్యాయి. 


ప్రయాగ్​రాజ్​ రైల్వే స్టేషన్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు జారీ చేసిన ప్రోటోకాల్స్​కు అందరూ కట్టుబడి ఉండాలని ఆయా స్టేషన్లకు సూచించారు. ప్రోటోకాల్స్​ ప్రకారం ప్రయాణికులు సిటీ సైడ్ ప్రవేశ ద్వారం నుంచి రైల్వే స్టేషన్​కు రావాల్సి ఉంటుంది. ప్రయాగ్​రాజ్ జంక్షన్​ వద్ద సివిల్స్​ లైన్స్​లో బయటకు వెళ్లాలి. ప్లాట్​ఫామ్​ల వద్దకు ట్రైన్స్​ వచ్చే వరకు ప్రయాణికులు హోల్డింగ్ ఏరియాలో వేచి ఉండాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu train police prayagraj

Related Articles