UPSC: ఇక పై నో చీటింగ్ ...ఏఐ సీసీటీవీ సాయంతో నిఘా ..యూపీఎస్సీ నిర్ణయం

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నీట్( NEET PAPER LEAKAGE)  పేపర్ లీకేజ్ వివాదంలో యూపీఎస్సీ( UPSC)  చాలా అలర్ట్ అయ్యింది. ఇక పై ఈ తప్పులు జరగకుండా సర్వీస్ కమిషన్ పరీక్షల్లో చీటింగ్ ( CHEATING) కు తావివ్వకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకోవాలని భావిస్తున్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ఆధారిత సీసీటీవీ కెమారాతో ఎగ్జామ్ సెంటర్ లో నిఘా పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.


Published Jun 25, 2024 01:46:38 PM
postImages/2024-06-25/1719303398_BB1oL2Bf.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నీట్( NEET PAPER LEAKAGE)  పేపర్ లీకేజ్ వివాదంలో యూపీఎస్సీ( UPSC)  చాలా అలర్ట్ అయ్యింది. ఇక పై ఈ తప్పులు జరగకుండా సర్వీస్ కమిషన్ పరీక్షల్లో చీటింగ్ ( CHEATING) కు తావివ్వకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకోవాలని భావిస్తున్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ఆధారిత సీసీటీవీ కెమారాతో ఎగ్జామ్ సెంటర్ లో నిఘా పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.


సీసీటీవీ( CCTV)  కెమెరాలను సమకూర్చుకోవడానికి టెండర్లు పిలిచింది. దీంతోపాటు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థుల ఎంట్రీ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థ, ఆధార్ ఆథెంటికేషన్ కోసం బయోమెట్రిక్ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. ఈ- అడ్మిట్ కార్డుల్లోని క్యూఆర్ కోడ్ స్కానింగ్ ను ఉపయోగించనుంది.


పరీక్ష జరుగుతుండగా హాల్ ( HALL) లో అభ్యర్థుల ప్రతీ కదలికను గుర్తించేలా సీసీటీవీ కెమెరాలను అమర్చనుంది. ప్రతీ 24 మంది అభ్యర్థులకు ఓ సీసీటీవీ కెమెరాను అమర్చి నిఘా పెట్టనుంది. ఇలా పరీక్ష( EXAM)  ప్రారంభమైన క్షణం నుంచి అభ్యర్థుల పేపర్లు ప్యాక్ చేసి, సీల్ చేసేంత వరకూ ప్రతీ క్షణం కెమెరాల్లో బంధించనుంది.  దీని వల్ల కాపీయింగ్ , చీటింగ్ లాంటివి  అవాయిడ్ చెయ్యొచ్చు. సీసీకెమెరాల ద్వారా సెంటర్లలో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, ఇన్విజిలేటర్ కదలకుండా ఒకేచోట ఉండిపోయినా, రూమ్ లో ఫర్నీచర్ సరిగ్గా అమర్చకపోయినా, కెమెరాలు ఆఫ్ లో ఉన్నా లేక మాస్కింగ్, బ్లాక్ స్క్రీన్ చూపించినా వెంటనే అప్రమత్తం చేసేందుకు ఏఐ సాయం తీసుకోనుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu artificial-intelligence cctv upsc neet-exam

Related Articles