మీరు పాలిచ్చే తల్లులా..తప్పక తెలుసుకోండి..పాలు తాగుతూ శిశువు మృతి.!

చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడితే  అంత బాగా ఎదుగుతారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం  తప్పనిసరిగా వారు మరణించే అవకాశాలు కూడా ఉంటాయి.  ముఖ్యంగా చిన్నపిల్లలు పాలు తాగే


Published Sep 24, 2024 05:15:00 PM
postImages/2024-09-24/1727177069_FEEDING.jpg

న్యూస్ లైన్ డెస్క్: చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడితే  అంత బాగా ఎదుగుతారు. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే మాత్రం  తప్పనిసరిగా వారు మరణించే అవకాశాలు కూడా ఉంటాయి.  ముఖ్యంగా చిన్నపిల్లలు పాలు తాగే విషయంలో తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలట. లేదంటే వారు మరణించే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. తాజాగా ఒక పాప మృతితో విచారణ చేసినటువంటి వైద్యులు సంచలనమైన విషయాలను బయటపెట్టారు.

ఆ పాప తల్లి పాలు తాగుతుండగానే శ్వాస ఆగిపోయిందని, శ్వాసనాలంలో  పాలు నిండడం వల్ల  ఇలా జరిగిందని ప్రాథమిక విచారణలో బయటపడింది.  ఇంగ్లాండ్ దేశంలోనే లీడ్స్ దవాఖానాలో ఒక మహిళ ప్రసవించింది.  అయితే ఒక రోజు తర్వాత ఆ తల్లి బిడ్డకు పాలిస్తూ, మందుల ప్రభావం వల్ల నిద్రలోకి జారుకుంది. ఆ ఒకరోజు వయసు ఉన్నటువంటి పాప  తల్లి నుంచి ఎక్కువ పాలు తాగింది.  కొన్ని నిమిషాల తర్వాత తల్లి లేచి చూసేసరికి ఆ పాపాయి గుండె ఆగిపోయి ఉంది. వెంటనే వైద్యులు వచ్చి గమనించగా మృతి చెందినట్లు నిర్ధారించారు.

అయితే నిద్రించే టైంలో పిల్లలకు ఆహారం ఇవ్వడం వల్ల ఊపిరాడకుండా పోయే ప్రమాదం ఉందని వైద్యులు అన్నారు. తల్లులు ఎప్పుడైనా సరే పిల్లలకు సరైన భంగిమలో ఉన్నప్పుడు మాత్రమే పాలు ఇవ్వాలని, పాపాయిలకు పాలిచ్చేటప్పుడు తల్లులు  వంగకూడదని తెలియజేస్తున్నారు. నిద్రిస్తున్న శిశువులకు  తల్లిపాలు పట్టినట్లయితే శ్వాసనాలంలో పాలు   కూరుకుపోయి ఊపిరాడకుండా పోయే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు.

శిశువుకు పాలు  ఇవ్వాలి అంటే తప్పనిసరిగా నిద్రలేపాలట. నిద్ర లేపడానికి బిడ్డ వాళ్ళ అరికాళ్లని మెల్లగా చెక్కిలిగింతలు పెట్టాలట.  దీనివల్ల వారి నిద్రకు భంగం కలిగి మేల్కొనే, తర్వాత పాలు తాగడం ప్రారంభిస్తారట. అంతేకాకుండా తల్లి పాలిచ్చే సమయంలో ముక్కు భాగానికి రొమ్ము దూరంగా ఉంచాలట. అంతేకాకుండా తల్లులు జుట్టును అలాగే వదిలిపెట్టి పాలు ఇవ్వకూడదట. గట్టిగా మడతెట్టుకొని  పాలు ఇవ్వాలట లేదంటే మీ వెంట్రుకలు వారి నోట్లోకి వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందట.

newsline-whatsapp-channel
Tags : news-line health-problems childrens mother milk-feeding

Related Articles