Zika Virus: మహారాష్ట్రలో జికా వైరస్ ..ఇప్పటికే ఆరు కేసులు నమోదు

Published 2024-07-02 15:25:15

postImages/2024-07-02/1719914115_2302627.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  వర్షాలు మొదలయ్యాయి..మళ్లీ వైరస్ లు విజృంభిస్తున్నాయి. మహారాష్ట్ర లో జికా వైరస్ కలకలం రేగింది. ఒక్క పూణే లోనే దాదాపు ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జికా వైరస్ కు ఎఫెక్ట్ అయిన వారిలో ఇద్దరు గర్భవతులు ఉన్నారు.


పుణేలో మొదట ఓ డాక్టర్ కు, ఆయన టీనేజి కుమార్తెకు జికా వైరస్ ( ZIKA VIRUS) పాజిటివ్ గా తేలింది. ఆ ఇద్దరి శాంపిల్స్ ను పరీక్షించగా, జికా వైరస్ నిర్ధారణ అయింది. పూణే ...దాదాపు టూరిస్ట్ ప్లేస్ . లోనావాలా...ట్రెక్కింగ్ ప్లేసులు, వాటర్ ఫాల్స్ లు ...ఇలా చాలా బిజీ గా ప్లేసులు ఉన్నాయి. టూరిస్ట్ ల వల్ల కూడా ఈ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు డాక్టర్లు.


గర్భవతులకు జికా వైరస్ సోకితే, పర్యవసానాలు ప్రమాదకరంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పుట్టే శిశువుపై ఈ వైరస్ ( VIRUS)  ప్రభావం తీవ్రస్థాయిలో కనిపిస్తుందని, సాధారణం కంటే  చాలా చిన్న తలతో శిశువులు జన్మిస్తుంటారని వివరించారు. శిశువుల్లో పుట్టుకతోనే వచ్చే ఇతర అసాధారణ ఆరోగ్య సమస్యలను కూడా ఈ వైరస్ కలిగిస్తుందని తెలిపారు. 


జికా వైరస్( Zika Virus ) రోజురోజుకి విస్తరిస్తోంది. ఇప్పటికే తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో ఈ వైరస్ పెరిగిపోతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ వ్యాధిని విస్తరించకుండా ఆపేందుకు ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. జికా వైరస్ అనేది దోమల కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఏడిస్ ఈజిప్టై, ఏడిస్ అల్బోపిక్టస్ అనే రకాల దోమలు జికా వైరస్ వాహకాలుగా పనిచేస్తాయి. జికా వైరస్ ను 1952లో మొట్టమొదటిసారిగా ఉగాండాలో గుర్తించారు. ఈ వ్యాధి సోకిన వారికి మందులు లేవు..ఎబోలా వైరస్ సృష్టించిన భీభత్సం తర్వాత ఇదే కోవకు చెందుతుంది జికా వైరస్ .