100 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: 100 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం నిర్మించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున్న నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామంలో ఆసుపత్రి లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, గ్రామస్తులు రోగాల బారిన పడితే మరో ఊరికి వెళ్లి పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రిని నిర్మించాలని అఖిలపక్షం నేతలు, గ్రామస్తులు వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం కానీ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. దీంతో తిరుమలాయపాలెం ప్రధాన రహదారిపై అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం గ్రామస్తలు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వెంటనే ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని అంబేద్కర్‌కు అఖిలపక్షం నేతలు వినతి పత్రం సమర్పించారు.