మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని మోదీ చెప్పారు. మన రక్షణ దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికి తలమానీకమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ జ్వలించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ , పీవోకేలో భారత్ చేపట్టిన " ఆపరేషన్ సిందూర్ " పై జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు. నాలుగు రోజులుగా భారత్ సైన్యం సామర్ధాన్ని ప్రపంచం అంతా చూస్తుంది, నిఘావర్గాల సామర్ధ్యం మన శాస్త్ర సాంకేతిక సామర్ధ్యాన్ని దేశంచూసిందని తెలిపారు.
మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని మోదీ చెప్పారు. మన రక్షణ దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశానికి తలమానీకమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ జ్వలించింది. ఈ రోజు ఆపరేషన్ సిందూర్ ..కోట్ల ప్రజల మనసులో ఉన్నదే. మన రక్షక దళాల వీరత్వాన్ని , ధైర్యాన్ని దేశంలోని ప్రతి తల్లికి , సోదరికి , కూతురికి అంకితం చేస్తున్నానని మోదీ చెప్పారు. మన మహిళల సిందూరాన్ని తుడిచిన వారిని బూడిద చేశామని తెలిపారు.