అమెరికా మధ్యవర్తిత్వానికి రావడంతో భారత్ శాంతించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య భవిష్యత్ చర్చలకు మార్గం సుగమం చేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారతదేశం మరియు పాకిస్థాన్ ఎన్నో దశాబ్దాలుగా గొడవలుపడుతూనే ఉన్నాయి. ఎన్నోవందల సార్లు పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వింది. ఎన్నో సార్లు భారత్ సహనంతో ఎదురుచూసింది. ఈ మధ్య జరిగిన పెహల్గామ్ అటాక్ తో ఇక భారత్ సహనం కోల్పోయింది. తమ దేశానికి శాంతి మంత్రమే కాదు ..తిరగబడడం కూడా తెలుసని అర్ధమయ్యేలా చేసింది భారత్ . గత రెండు రోజులు గా పాకిస్థాన్ చాలా కాస్ట్లీ దీపావళి జరుగుతుంది. యుధ్ధం అంటూ జరిగితే రెండు వైపులా నష్టం జరుగుతుంది. కాని భారత్ కు మామూలు నష్టమైతే ...పాకిస్థాన్ కు మరో పదేళ్ల అభివృధ్ధి నష్టం జరిగింది. పాకిస్థాన్ ప్రజలు కాళ్ల బేరానికి వచ్చినా భారత్ తగ్గలేదు. ఇంకా పాకిస్థాన్ కు బుధ్ధి చెప్పే పనిలోనే ఉంది. కాని అమెరికా మధ్యవర్తిత్వానికి రావడంతో భారత్ శాంతించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య భవిష్యత్ చర్చలకు మార్గం సుగమం చేస్తున్నారు.
ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రూత్ సోషల్' ద్వారా వెల్లడించారు. ఎక్స్ లోనూ ఇదే విషయాన్ని పంచుకున్నారు. "అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం, భారత్, పాకిస్థాన్ దేశాలు తక్షణమే పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. ఈ విషయంలో రెండు దేశాలు చాలా తెలివిగా ప్రవర్తించాయని తెలిపారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. భారత్, పాకిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన తెలిపారు. "పాకిస్థాన్ ఎప్పుడూ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీ పడకుండా, ఈ ప్రాంతంలో శాంతి, భద్రతల కోసం కృషి చేసింది!" అని దార్ అన్నారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా కూడా ప్రకటిచారు. భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని .."శాంతి మార్గాన్ని ఎంచుకున్న ప్రధానులు మోదీ, షరీఫ్ ల విజ్ఞత, వివేకం, రాజనీతిజ్ఞతను మేము ప్రశంసిస్తున్నాము" అని రూబియో తన పోస్ట్‌లో పేర్కొన్నారు.