Flag Code: జాతీయ జెండా నియామావళి ఎంత మందికి తెలుసు? ఎలా వాడాలి?

జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే, పొరపాట్లు చేస్తే శిక్షార్హులు అవుతారు


Published Aug 14, 2024 01:24:00 PM
postImages/2024-08-14/1723622071_flag.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జాతీయ జెండా దేశానికి గర్వకారణం. భారతీయులు అందరు గౌరవించే పతాకం . ఇప్పటికి ఎప్పటికి జాతీయ జెండా ఎగరేయడం ఓ పండుగ. తెలీకుండానే భారతీయుల్లో ఆగష్టు 15 ఓ పండుగ. అలాంటి జాతీయ జెండా ఎగరేయడం ప్రతి భారతీయునికి తెలిసి తీరాల్సిందే. జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే, పొరపాట్లు చేస్తే శిక్షార్హులు అవుతారు. పేపర్ జెండాల విషయంలోనూ కేంద్రం సూచనలను చేసింది. రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆ వివరాలు..


జాతీయ జెండాలను కొంత మంది నిర్లక్ష్యంగా ఇష్టానుసారం పడేస్తుంటారు. అది చట్టరీత్యా నేరం. జాతీయ జెండాకు ఓ నియమావళి ఉంది. 2024 భారత గణతంత్ర వేడుకలకు ముందు కాగితపు జెండాల వినియోగానికి సంబంధించి కేంద్ర హోం శాఖ కొన్ని సూచనలు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సహా ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు, సాంస్కృతిక, క్రీడా సంబంధిత కార్యక్రమాలన్నింటికీ ఈ నియమాలు వర్తిస్తాయి. ఈ సందర్భంగా వినియోగించే కాగితపు జెండాలను.. ఈవెంట్లు పూర్తయ్యాక నేలపై ఇష్టానుసారం విసిరేయకూడదు. అలా విసిరేస్తే కఠినచర్యలు తప్పవు. మన సెలబ్రేషన్స్ అయిపోయాక జెంాలను చాలా గౌరవప్రదంగా డిస్పోజ్ చెయ్యాలి. దీని పై ప్రజలకు ఇంకా అవగాహన లేదు. చిన్న చిన్న ఊర్లలో ..ఇంకా ఇలాంటి రూల్ ఉందని తెలీదు కూడా.
జాతీయ జెండాకు ఉన్న నియామావళి ఏంటో చూద్దాం..


* జాతీయ పతాకాన్ని నేలపై పడేయకూడదు. నీటిపై తేలనీయకూడదు.


* జాతీయ జెండాను దుస్తులుగా కుట్టించుకోవద్దు. జాతీయ జెండాను కట్ చేసి కుట్టకూడదు.


*జాతీయ జెండాను నడుము కింది భాగంలో చుట్టుకోవద్దు. 


* జాతీయ జెండాను అలంకరణ కోసం ఉపయోగించకూడదు. చేతులు తుడుచుకోవడం లాంటివి చెయ్యకూడదు.


* జాతీయ పతాకాన్ని ఏ వస్తువు మీదా కప్పవద్దు. దేశం కోసం ప్రాణాలు విడిచిన వారిపై కప్పడానికి జాతీయ జెండా అంత గౌరవాన్ని జవాన్ కు దక్కడానికే ఇలా చేస్తారు.


* చిరిగిన, నలిగిన, తిరగబడిన జెండాలను ఎగురవేయొద్దు.


*  జాతీయ పతాకాన్ని ఎగరేసినప్పుడు.. అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు.


*  త్రివర్ణ పతాకం ఎగరేసినప్పుడు కాషాయ రంగు పైకి ఉండాలి.


* జెండాను ఎగురవేసేటప్పుడు అది ధ్వజస్తంభానికి కుడి వైపున ఉండాలి.


* స్తంభానికి చిట్టచివరనే జెండాను ఎగురవేయాలి. సగం కిందకు దించి ఎగురవేయకూడదు.


* జెండా స్తంభం మీద, జెండాపైన పూలు, ఆకులు, దండలు లాంటివి పెట్టకూడదు.


*  జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు సిద్ధం చేస్తున్నప్పుడు అందులో పువ్వులు ఉంచొచ్చు.


 * జాతీయ పతాకంపై ఏం రాయకూడదు.


*  జాతీయ పతాకాన్ని ఏ వస్తువులనూ, భవనాలను మొదలైన వాటిని కవర్‌ చేయకూడదు.


 * జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా నేలపై లేదా నీటిలో, కాలిబాటలో వేయరాదు.


 * హాని కలిగించే విధంగా జాతీయ జెండాపే ప్రదర్శించకూడదు, కట్టకూడదు.


*  త్రివర్ణ పతాకం దేశ గౌరవానికి చిహ్నం. దాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు.


*  వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేప్పుడు.. జెండా ఎగురవేసే వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు, * త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతడి కుడి వైపున ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.


జాతీయ పతాకాన్ని ఎవరైనా ఎగరవేయొచ్చు. బహిరంగ ప్రదేశాల్లో, ఇంటిపై ఎగురవేసేందుకు అనుమతి ఉంది. అయితే, నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే. జాతీయ పతాకాన్ని రాత్రి సమయంలోనూ ఎగురవేయొచ్చు.

ఇంతకుముందు రాత్రి సమయంలో ఎగురవేయడం రూల్ లో లేదు. కాని 2022 లో రూల్స్ కాస్త మార్చారు. రాత్రి వేళలో కూడా ఇప్పుడు జెండాను ఎగురవేయచ్చు.

 
నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష


త్రివర్ణ పతాకాన్ని గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారుచేసేవారు. 2021 డిసెంబర్‌ 30 నుంచి పాలిస్టర్‌ ఫ్యాబ్రిక్‌తోనూ జాతీయ జెండాను తయారు చేయడానికి అనుమతి ఇచ్చారు. కారణం రోజులు మారుతున్నాయి. ఇప్పుడు దొరికిన ఫాబ్రిక్ తో పతాకం తయరుచేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : news-line life-style india

Related Articles