హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, CPI నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పందించారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అలాగే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని కూనంనేని అన్నారు.