Big boss8: ఫస్ట్ వీక్ ఎలిమినేట్..పక్కా ఆ కంటెస్టెంటేనా.?

బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన మూడవ రోజే మూడు అల్లర్లు, ఆరు కొట్లాటలు అనే విధంగా తయారయింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ల మధ్య జరిగినటువంటి వార్ ఫిక్స్ కు వెళ్ళిపోయింది. మరి ఈ నామినేషన్లలో


Published Sep 04, 2024 09:20:00 AM
postImages/2024-09-04/1725419769_biggboss8.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన మూడవ రోజే మూడు అల్లర్లు, ఆరు కొట్లాటలు అనే విధంగా తయారయింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్ల మధ్య జరిగినటువంటి వార్ ఫిక్స్ కు వెళ్ళిపోయింది. మరి ఈ నామినేషన్లలో ఎవరెవరు నిలిచారు అనే వివరాలు చూద్దాం..  బిగ్ బాస్ సీజన్ 8 మొదలైన మూడవరోజు నామినేషన్ల ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. ఇందులో చాలామంది కంటెస్టెంట్లు సిల్లీ సిల్లీ రీజన్స్ చెబుతూ నామినేషన్లు చేశారు. ఇందులో ముఖ్యంగా చాలామంది నాగమణికంఠ మరియు  బేబక్కను నామినేట్ చేశారు. ముఖ్యంగా బేబక్కను వంట విషయంలో సరిగ్గా చేయలేదని ఆకుల సోనియా ఆరోపించడంతో ఆ పాయింట్ ను పట్టుకొని చాలామంది  నామినేట్ చేయడం జరిగింది.  

అంతేకాకుండా నాగ మణికంఠను కూడా నీ మాట తీరు బాగాలేదు నువ్వు ఇంకా మారాలి అంటూ ఆ రీజన్ తో నామినేట్ చేశారు. అంతేకాకుండా నామినేషన్ ప్రక్రియలో విష్ణుప్రియ,  శేఖర్ భాషా, సోనియా,  పృథ్వీరాజ్ నిలిచారు. మరి ఈ ఆరుగురు నామినేషన్ ప్రక్రియలో ఉన్న టైంలో  ఎవరు ఈ వారం బయటకు వెళ్లిపోతారు, ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడింది అనే వివరాలు చూద్దాం..  సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్న దాని ప్రకారం చూస్తే ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా  నామినేట్ అయిన వారిలో  విష్ణుప్రియ కు అత్యధిక ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి విష్ణు ప్రియ ఎలిమినేట్  అయ్యే అవకాశం చాలా తక్కువ.

ఆ తర్వాత స్థానాన్ని నాగమణికంఠ  భర్తీ చేశారు.  ఎందుకంటే ఈయన హౌస్ లోకి వచ్చినప్పటి నుంచే ఎమోషనల్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు.  అమ్మ చనిపోతే కట్టే కట్టే ఏరుకొని పైసా పైసా పోగేసుకుని అంత్యక్రియలు నిర్వహించాలని, ఎంతో కష్టపడ్డానని, నా భార్య, నా కూతురికి నేను బిగ్ బాస్ ద్వారా గిఫ్ట్ ఇస్తారని ఎమోషనల్ క్రియేట్ చేశారు. దీని ద్వారా ఆయన కొంతమంది ఆడియన్స్ ను కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇక మూడవ స్థానంలో ఉన్న పృథ్వీరాజ్ కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో కాస్త పేరు ఉన్న యాక్టర్. ఈయనను ఒక కప్పు కాఫీ కోసం బేబక్క నామినేట్ చేసింది. వెంటనే పృథ్వీరాజ్ లేచి కాపీ అడిగితే నామినేట్ చేస్తావా అనే పాయింట్ రేజ్ చేశారు. ఈ విధంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే సరైన సమాధానం ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. చివరికి తప్పయింది అంటూ, ఆమె వయసుకు గౌరవం ఇచ్చి సారీ చెప్పారు పృథ్వీరాజ్. ఆ తర్వాత సోనియా ఆకుల మొదటినుంచి ప్రతి ఇష్యులో పాల్గొంటూ,  సమాధానం ఇస్తూ  తన వాయిస్ రేజ్ చేస్తోంది. బాగానే మాట్లాడుతుంది కానీ అక్కడ చీఫ్ లుగా ఉన్న వారిని కూడా చాలా చీప్ గా చూస్తోంది.

ఈ పాయింట్ ఎవరికీ నచ్చలేదు. అయినా ఆమె మంచి ఆదరణ పొందుతుందని అర్థమవుతుంది. ఆ తర్వాత శేఖర్ భాష  ఏదో అదులో మాట్లాడాలి, ఏదో ఒక గొడవ క్రియేట్ చేయాలనే విధంగా ట్రై చేస్తున్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఏది కూడా కరెక్ట్ ఉండడం లేదు. ప్రతి దాంట్లో తల దురుస్తున్నాడు, నేనింతే, నాలాగే ఉంటా, మీకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక చివరిగా బేబక్క ఈమె కిచెన్ మాస్టారుగా  రెండో రోజు కర్రీ అంతా పాడు చేసిందని విమర్శలు వచ్చాయి. అయితే ఈమెను ఇదే పాయింట్ పట్టుకొని చాలామంది నామినేట్ చేశారు. ఈ సమయంలో బేబక్క కర్రీ కోసం నామినేట్ చేస్తారా అనే విషయంపై గట్టిగా స్పందించాల్సి ఉండేది. కానీ ఆమె అలా చేయలేదు. సిల్లీ సిల్లీ రీజన్స్ చెబుతూ మిగతా వారిని ఆమె కూడా నామినేట్ చేసింది.  కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఓటింగ్ ప్రకారం  బేబక్కనే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఈమె కాకుంటే సెకండ్ స్థానంలో శేఖర్ బాషా ఉంటారని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu big-boos8 shekhar-bhasha naga-manikanta bejawada-bebakka aakula-sonia prithvi-raj 1st-week-nomination

Related Articles